తెలంగాణ రాష్ట్రంలో అబ్కారీ శాఖ కీలక వార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 41 '2బీ' కేటగిరీ బార్ (బార్ అండ్ రెస్టారెంట్)ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
{{^htLoading}} {{/htLoading}}
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, సమీప గ్రామాల విలీనం, జనాభా పెరుగుదల, నూతనంగా ఏర్పాటైన క్యూర్ పరిధిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యూర్ పరిధిలో 14 బార్లు (గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలు), ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 27 బార్లకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 1,131 బార్లు అందుబాటులో ఉండగా, గత ఏడాది 14 కొత్త బార్లకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అదనంగా మరో 41 బార్లు అందుబాటులోకి రానున్నాయి.
దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభమై అక్టోబరు 12 వరకు కొనసాగనుంది. దరఖాస్తు రుసుము ప్రతి అప్లికేషన్‌కు రూ.1,00,000(రూ. లక్ష) నాన్-రిఫండబుల్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. క్యూర్ పరిధి (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) అబ్కారీ భవన్‌లోని కమిషనర్ కార్యాలయం లేదా సంబంధిత ప్రాంత డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. ఇతర జిల్లాల్లో చూసుకుంటే.. ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు, డీపీఈవో కార్యాలయాలు, కమిషనర్ ఆఫీస్‌లలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన పక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. లైసెన్స్ ఫీజుల వివరాలు (ఏడాదికి)ప్రాంతాల ప్రాముఖ్యతను బట్టి ఎక్సైజ్ శాఖ వార్షిక లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి రూ.44 లక్షలు, నిజామాబాద్ (బోధన్) రూ.42 లక్షలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.30 లక్షలుగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు, మార్గదర్శకాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ tgbcl.telangana.gov.in ను సందర్శించవచ్చు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.