TGPSC Recruitment 2026 : జలమండలిలో 130 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు

TGPSC Manager Recruitment 2026 : హైదరాబాద్ జలమండలిలో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అక్టోబర్ 17 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

Published on: Sep 25, 2026, 15:10:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ జలమండలిలో కొలువు సాధించాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) లో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా…. తాజాగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

జలమండలిలో 130 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం
జలమండలిలో 130 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం

నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయనున్న 130 మేనేజర్ పోస్టులను వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు కేటాయించారు. ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి.

  • సివిల్ ఇంజినీరింగ్ : మొత్తం ఖాళీల్లో ఏకంగా 80 శాతం పోస్టులను సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకే కేటాయించారు. అంటే 104 పోస్టులు సివిల్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.
  • ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజినీరింగ్ : ఈ విభాగానికి 15 శాతం పోస్టులను కేటాయించారు. దీని ప్రకారం 19 ఖాళీలు ఉన్నాయి.
  • కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఈసీఈ (CSE / IT / ECE) : ఈ విభాగాల అభ్యర్థులకు 5 శాతం పోస్టులు కేటాయించారు. వీటి సంఖ్య 7గా ఉంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి. ప్రారంభ వేతన స్కేలు నెలకు రూ. 54,220 నుంచి ప్రారంభమై రూ. 1,33,630 వరకు ఉంటుంది.

ఈ మేనేజర్ పోస్టుల ఎంపిక కోసం రాత పరీక్షలు నిర్వహించనున్నారు. 2026 డిసెంబరు నెలలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు (CBT) లేదా ఆఫ్‌లైన్ ఓఎంఆర్ పద్ధతిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు TGPSC తన తాత్కాలిక షెడ్యూల్‌లో పేర్కొంది. ఖచ్చితమైన పరీక్ష తేదీలను కమిషన్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…..

  1. మొదటగా TGPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ను సందర్శించాలి.
  2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'Application for Manager (Engineering) ' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి, క్యాప్చా నొక్కి 'Get OTP' పై క్లిక్ చేయాలి.
  4. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP) ని నమోదు చేసి లాగిన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
  5. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హతలు, కేటగిరీ వివరాలు సరి చూసుకుని, అవసరమైన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
  6. నిర్ణీత పరీక్ష రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, దరఖాస్తును సబ్‌మిట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ లేదా పిడిఎఫ్ రూపంలో భద్రపరుచుకోవాలి.

చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా ఉండేందుకు అభ్యర్థులు గడువు ముగిసే అక్టోబర్ 17 కంటే ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More