ECIL హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

ఈసీఐఎల్ హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 20 పోస్టులను భర్తీ చేస్తారు. జనవరి 20వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది.

Published on: Jan 7, 2026, 14:06:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జనవరి 20వ తేదీతో పూర్తవుతుంది.

ECIL హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు
ECIL హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు

ECIL హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు - ముఖ్యమైన వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌, హైదరాబాద్
  • మొత్తం ఖాళీలు - 20
  • ఖాళీల వివరాలు - టెక్నీషియన్‌ - 13, సూపర్‌ వైజర్‌ - 05, డ్రాఫ్ట్స్‌ మెన్‌ సూపర్‌వైజర్ 2
  • సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం ఉండాలి.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35లోపు ఉండాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులకు చివరి తేదీ - 20 జనవరి 2026
  • ఎంపిక విధానం - ఆన్ లైన్ దరఖాస్తులను పరిశీలిస్తారు. 1:4 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటుంది.
  • అప్లికేషన్ లింక్ - https://ecerp01.ecil.gov.in/ecilerec#
  • అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/jobs.html

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చూడొచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More