TGCAB Recruitment 2025 : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు - దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు జిల్లాల్లోని సహకార బ్యాంకుల్లో ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

జిల్లాల వారీగా ఖాళీలు….
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో కలిపి మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 6వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. జిల్లా వారీగా ఖాళీలను చూస్తే… కరీంనగర్‌లో 43, హైదరాబాద్ లో 32 ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో 99, వరంగల్ లో 21, మెదక్ లో 21 ఉండగా మహబూబ్‌నగర్ లో 9 పోస్టులున్నాయి. కేవలం డిగ్రీ మాత్రమే కాకుండా… తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఆంగ్ల భాష పరిజ్ఞానం కూడా తప్పనిసరి. దరఖాస్తుదారుడి వయసు 01.10.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 - రూ.64,480 మధ్య చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
అప్లికేషన్ ప్రాసెస్….
- అర్హులైన అభ్యర్థులు ముందుగా https://tgcab.bank.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా కనిపిస్తాయి.
- న్యూ రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ జిల్లాల వారీగా వివరాలు ఉంటాయి.
- ముందుగా అప్లికేషన్ ఫీజు(జనరల్/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.250.) చెల్లించాలి.
- మీ ప్రాథమిక వివరాలు, ఫొటో, సంతకంతో పాటు పలు పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- చివరిగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

