Anganwadi Recruitment : రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ పూర్తి వివరాలు
Rangareddy Anganwadi Recruitment 2026 : రంగారెడ్డి జిల్లా అంగన్‌వాడీల్లో 125 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Rangareddy Anganwadi Recruitment 2026 : రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 125 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రమతి శాంతి శ్రీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం… మొదటి దశలో ఈ అంగన్‌వాడీ టీచర్ ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు…
- ఆమనగల్: 31 పోస్టులు
- చేవెళ్ల: 29 పోస్టులు
- ఇబ్రహీంపట్నం: 21 పోస్టులు
- షాద్ నగర్: 26 పోస్టులు
- మహేశ్వరం: 10 పోస్టులు
- శేరిలింగంపల్లి: 5 పోస్టులు
- హయత్ నగర్: 3
- పోస్టులు మొత్తం ఖాళీలు: 125
అభ్యర్థిని తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణురాలై ఉండాలి. 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. గ్రామ పంచాయతీ పరిధిలో అయితే సంబంధిత గ్రామానికి, పట్టణ/మున్సిపాలిటీ ప్రాంతాల్లో అయితే ఆయా వార్డుకు చెందిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఉప-ప్రణాళిక నివాస ప్రాంతాల పోస్టులకు అదే నివాస ప్రాంతానికి చెందిన వారే అర్హులు. వినికిడి పరికరం ఉపయోగించేవారు, సహాయకుడితో విధి నిర్వహణ చేయగల అంధత్వం ఉన్నవారు మరియు పూర్వ ప్రాథమిక విద్యను బోధించగల కాళ్లు, చేతుల వైకల్యం ఉన్నవారు కూడా రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు వయస్సు ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వితంతువు, అనాథ, దివ్యాంగులు, ఈడబ్యూఎస్ లేదా స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన వారైతే సంబంధిత పత్రాలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళలు తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ wdcw.tg.nic.in సందర్శించి పూర్తి సమాచారాన్ని పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

