...
...
Next Story

Anganwadi Posts : హన్మకొండ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫకేషన్

Anganwadi Posts : హనుమకొండ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ వెలువడింది. అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేయాలి.

Published on: Sep 27, 2026, 15:40:41 IST
Advertisement

హనుమకొండ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ 55 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భీమదేవరపల్లి, హనుమకొండ అర్బన్, పరకాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు 2026 సెప్టెంబర్ అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. భీమదేవరపల్లి 23, హనుమకొండ 19, పరకాల 13 మొత్తంగా చూసుకుంటే 55 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు తేదీ 01.07.2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి. అంగన్ వాడీ టీచర్ పోస్టులకు, అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీ/ కార్పొరేషన్ అయితే అంగన్వాడీ కేంద్రం ఉన్న వార్డు డివిజన్ నివాసి అయి ఉండాలి, గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ నివాసి అయితే సరిపోతుంది.

ఎంపిక విధానం

ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్ వాడీ టీచర్ పోస్టులకు, అదే గ్రామం/ఆవాసం/హాబిటేషన్ నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టుకు అదే గ్రామ పంచాయతీలోని ఎస్సీ అభ్యర్థులు అర్హులు అవుతారు.

ఎస్సీ సబ్-ప్లాన్ కింద ఎస్సీ కేటగిరీకి రిజర్వు చేసిన ఖాళీల విషయంలో, ఎస్సీ గ్రూప్-1, ఎస్సీ గ్రూప్ - II, ఎస్సీ గ్రూప్ -III వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులందరినీ ఎంపిక ప్రక్రియ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్సీ రోస్టర్ కేటాయించిన గ్రూపునకు చెందిన అర్హులైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సంబంధిత కేటాయించిన గ్రూపులో అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, అమలులో ఉన్న రిజర్వేషన్ నిబంధనల ప్రకారం తర్వాత ఎస్సీ ఉపవర్గాల అభ్యర్థులతో ఆ ఖాళీలను భర్తీ చేస్తారు.

మొత్తం మార్కులు 100కు ఉంటాయి. ఇందులో ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు, ప్రత్యేక కేటగిరీలు, వితంతువులు 5 మార్కులు, అనాధలు 10 మార్కులు, దివ్యాంగులు 5 మార్కులు ఇస్తారు. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకి 10 మార్కులు ఉంటాయి.

అప్‌లోడ్ చేయవలసిన ధ్రువపత్రాలు

పుట్టిన తేది / వయస్సు ధృవీకరణపత్రం, కుల ధృవీకరణపత్రం, విద్యార్హత ధృవీకరణపత్రం, నివాస ధృవీకరణపత్రం, అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణపత్రం కావాలి.

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు

మ్యాన్యువల్, తపాలా, ఈ-మెయిల్ లేదా ప్రజావాణి/CDPO/DWO కార్యాలయాల్లో నేరుగా ఇచ్చే దరఖాస్తులు స్వీకరించరు. ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://wdcw.tg.nic.in‌లో చూడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks