Telangana : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 160 ఉద్యోగాలు - నెలకు రూ.1.90 లక్షల వరకు జీతం! ఇంటర్వ్యూనే

GMC Wanaparthy Recruitment 2026 : తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ పరిధిలోని వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 160 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టులకు ఆగస్టు 12న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

Published on: Aug 9, 2026, 17:13:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

GMC Wanaparthy Recruitment 2026 : తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ (DME) పరిధిలోని వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు అనుబంధ జనరల్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలోనూ, సీనియర్ రెసిడెంట్ పోస్టులను హానరేరియం పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 160 ఉద్యోగాలు - నెలకు రూ.1.90 లక్షల వరకు జీతం!
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 160 ఉద్యోగాలు - నెలకు రూ.1.90 లక్షల వరకు జీతం!

ఖాళీల వివరాలు :

మొత్తం 160 పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన వైద్యులు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాలు 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు అమలులో ఉంటాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ (OBG), పీడియాట్రిక్స్, రేడియో డయాగ్నోసిస్, కార్డియాలజీ, న్యూరాలజీతో సహా పలు విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

  • ప్రొఫెసర్ : 25 పోస్టులు
  • అసోసియేట్ ప్రొఫెసర్ : 43 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ : 29 పోస్టులు
  • సీనియర్ రెసిడెంట్ : 33 పోస్టులు
  • ట్యూటర్ : 30 పోస్టులు

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్: సంబంధిత స్పెషాలిటీ విభాగంలో MD/MS/DNB ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం నిర్ణీత బోధనా అనుభవం, పరిశోధనా పత్రాల ప్రచురణలతో పాటు ఎంఈటీ, బయోమెడికల్ రిసెర్చ్ కోర్సులు పూర్తి చేయడం తప్పనిసరి.

  • సీనియర్ రెసిడెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో MD/MS/DNB/MDS పూర్తి చేసి ఉండాలి.
  • ట్యూటర్ పోస్టుకు MBBS అర్హత కలిగి ఉండాలి.
  • అన్ని పోస్టులకు సంబంధించి అభ్యర్థులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) లో తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారం రోజుల్లోగా తెలంగాణ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
  • ప్రొఫెసర్: రూ. 1,90,000
  • అసోసియేట్ ప్రొఫెసర్: రూ. 1,50,000
  • అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ. 1,25,000
  • సీనియర్ రెసిడెంట్: రూ. 1,06,461
  • ట్యూటర్: రూ. 55,000

అర్హత పరీక్షల్లో (MD/MS/DNB/MDS/MBBS) సాధించిన మార్కుల మెరిట్, బోధనా అనుభవం మరియు ఇంటర్వ్యూ ప్రదర్శన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో స్థానిక అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More