...
...
Next Story

వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్ - ఈ 4 రోజుల్లో 24 గంటలపాటు దర్శనాలు..!

వేములవాడకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మేడారం జాతర సమయ దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28తో పాటు జనవరి 4, 11, 18 తేదీల్లో 24 గంటల పాటు ఆలయాన్ని తెరవనున్నామని వెల్లడించారు.

Published on: Dec 28, 2025, 06:57:30 IST
Advertisement

వేములవాడ రాజన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో మొక్కుల చెల్లింపు జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే మేడారం జాతర షురూ కానుంది. అయితే ఈ జాతరకు ముందు భక్తులు వేములవాడ రాజన్నకు కోడె మొక్కులతో పాటు వివిధ ఆర్జిత సేవల మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి భక్తులు భారీగా తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు.

వేములవాడ రాజన్న దర్శనాలు
వేములవాడ రాజన్న దర్శనాలు

భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో బద్ది పోచమ్మ ఆలయం వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆలయ పరిసరాలు భక్తజనసంద్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల పాటు 24 గంటల పాటు దర్శనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

24 గంటలపాటు దర్శనాలు…!

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్ 28) 24 గంటలపాటు తెరిచి ఉంచున్నారు. ఈ మేరకు వేములవాడ ఆలయ ఈవో రమాదేవి శనివారం ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా జనవరి 4, 11, 18 తేదీల్లో కూడా 24 గంటలపాటు దర్శనాలు ఉండనున్నాయి. ఇక బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయ దర్శనాలను కూడా ఈనెల 29వ తేదీన 24 గంటలపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఆయా తేదీల్లో చాలా మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న భీమేశ్వరాలయంలో దర్శనాల కోసం ఏర్పాట్లు చేశారు.

మరోవైపు శృంగేరి పీఠాధిపతి సలహా మేరకు విస్తరణ పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గర్భగుడిలో మండపాలు 64 నుండి 70 స్తంభాల నిర్మాణం కోసం పెద్ద నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నారన్నారు. భక్తులను లోపలికి అనుమతిస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని వివరించారు. విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ రాజన్నకు పూజలు కొనసాగుతున్నట్లు పేర్కొంటున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe