...
...
Next Story

TG SSC Exams 2026 : తెలంగాణ టెన్త్ పరీక్షలపై కొత్త అప్డేట్ - ఈసారి కూడా OMR షీట్...! ఇలా చెక్ చేసుకోండి

Telangana 10th Exam Updates : తెలంగాణ టెన్త్ పరీక్షలపై అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది కూడా ఆన్సర్ బుక్ లెట్ కు ఓఎంఆర్ షీట్ జత చేయబడి ఉంటుందని ప్రకటించారు.

Published on: Mar 11, 2026 07:39 PM IST
Advertisement

పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే పరీక్షలకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.

ఈసారి కూడా OMR షీట్…

తెలంగాణ టెన్త్ పరీక్షలు
తెలంగాణ టెన్త్ పరీక్షలు

గతేడాది మాదిరిగానే ఈసారి పరీక్షల్లో కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉంటుందని పరీక్షల విభాగం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. గత ఏడాది ఆన్సర్ షీటుకు ఓఎంఆర్ షీట్ జత చేసి విద్యార్థులకు అందజేశారు. ఈసారి కూడా అదే మాదిరిగానే ఆన్సర్ షీట్ కు ఓఎంఆర్ షీట్ ఉండనుంది. విద్యార్థులు…. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన OMR షీట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఓఎంఆర్ ఫార్మాట్‌పై విద్యార్థులకు అవగాహన పెంచుకోవడానికి వీలుగా నమూనా కాపీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.విద్యార్థులు www.bse.telangana.gov.in మరియు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లలోకి వెళ్లి OMR షీట్ తో కూడిన ఆన్సర్ బుక్‌లెట్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇక ఈసారి జరగబోయే టెన్త్ పరీక్షలను 2,676 కేంద్రాలలో నిర్వహిస్తారు. 5.28 లక్షలకు పైగా విద్యార్థులు మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు రాస్తారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి.

పదో తరగతి హాల్ టికెట్ - డౌన్లోడ్ ప్రాసె

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: bse.telangana.gov.in.
  • హోమ్‌పేజీలో SSC హాల్ టికెట్ 2026 డౌన్‌లోడ్ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ విద్యార్థి వర్గాన్ని ఎంచుకోండి(రెగ్యులర్ / ప్రైవేట్ / OSSC / ఒకేషనల్).
  • అవసరమైన వివరాలు నమోదు చేయండి.
  • TG SSC 2026 హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి.

టీజీ టెన్త్ ఎగ్జామ్స్ 2026 - షెడ్యూల్

  • 14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
  • 18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
  • 23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
  • 28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
  • 02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
  • 07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
  • 13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
  • 15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
  • 16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్).

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe