మార్చి నెలాఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి.. ఏప్రిల్ నెలలో మరో విడత
మార్చి నెలాఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయనున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ నెలలో మరో విడత అందజేయనున్నట్టుగా వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తామని దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్లాగ్‌షిప్ హౌసింగ్ స్కీమ్‌లోని రెండో దశలో, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో మరో రౌండ్ ఇందిరమ్మ ఇళ్లను చేపడుతుందని, అర్హులైన పేదలందరికీ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని మంత్రి తెలిపారు.

ఇటీవల ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో పలు రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చిన బీఆర్‌ఎస్ పాలకులు ఇళ్లులేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అందజేస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామేపల్లి మండలంలో సుమారు రూ,12.48 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలను అందించడంతో పాటు గృహాప్రవేశాలు చేయించారు మంత్రి పొంగులేటి. గత పాలకులు పదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని పొంగులేటి విమర్శించారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు మంత్రి పొంగులేటి. 'మార్చి చివరి నాటికి లక్షఇండ్లు గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ప్రజాప్రభుత్వం లక్ష్యం.' అని పొంగులేటి అన్నారు.
రెండున్నరేళ్లలోనే బీరోలు అభివృద్ధికి రూ.29.92 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా మంత్రి పొంగులేటి తెలిపారు. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, రాకాసి తండా, బంధంపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
అకేరు వరద ప్రభావిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ప్రజాప్రభుత్వం పేదల ఆత్మగౌరవమే లక్ష్యంగా.. అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ ముందుకు సాగుతోందన్నారు. 'రాకాసితండా వరద బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు, స్థలాలు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే 99 రోజుల ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక కార్యక్రమాన్నిప్రజాప్రభుత్వం చేపట్టింది. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకొస్తోంది. ప్రజాప్రభుత్వంపై ప్రజలు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలు భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి స్ఫూర్తినిస్తాయి.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


