శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు వార్షిక కల్యాణం చేస్తారు. అత్యంత వైభవంగా నిర్వహించే క్రతువును భక్తులు వీక్షించేందుకు వీలుగా సెక్టార్ (విభాగం)లను ఏర్పాటు చేశారు. ఈ టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
బుకింగ్ ప్రాసెస్ ఇలా…
ఈ టికెట్లను భద్రాచలం రామాలయం అధికారిక వెబ్‌సైట్ https://bhadradritemple.telangana.gov.in/ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచే ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వతా హోం పేజీలోని శ్రీరామనవమి టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కల్యాణం సెక్టార్, పట్టాభిషేకం సెక్టార్ ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన సెక్టార్ పై క్లిక్ చేసి.. నిర్ణయించిన ఫీజును చెల్లించి టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. రాములవారికి తలంబ్రాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేసి పంపిస్తారు. స్వామి కళ్యాణం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులను భద్రచలానికి నడుపుతాయి. ఈ సమయంలో భక్తుల రద్దీ కారణంగా అదనపు సర్వీసులు ఉంటాయి. సీతారామచంద్రుల కల్యాణోత్సవం తలంబ్రాలు కావాలంటే బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే వస్తాయి.
ఇంటికే తలాంబ్రాలు - ఆర్టీసీ సేవలు:
మార్చి 27వ తేదీన శ్రీరామనవమి. ఈ సందర్భంగా భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాములవారి కళ్యాణంలోని తలంబ్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. భక్తులు పవిత్రంగా భావిస్తారు. వాటిని కావాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మీ ఇంటి వద్దే శ్రీరాములవారి కళ్యాణం తలంబ్రాలు పొందవచ్చు.
భక్తులు రూ.151 చెల్లించి.. https://tgsrtclogistics.co.in/TSRTC/ లేదంటే సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033ని సంప్రదించండి. ఇప్పటి నుంచి బుకింగ్ చేయవచ్చు.
{{/usCountry}}భక్తులు రూ.151 చెల్లించి.. https://tgsrtclogistics.co.in/TSRTC/ లేదంటే సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033ని సంప్రదించండి. ఇప్పటి నుంచి బుకింగ్ చేయవచ్చు.
{{/usCountry}}