Osmania University Distance Education Admissions 2026 : ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే ఉద్యోగులకు, దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ మంచి సువర్ణావకాశం కల్పించింది. యూజీసీ దూరవిద్య విభాగం గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి దూరవిద్య కేంద్రం (PGRRCDE)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల వివరాలు….
- పీజీ కోర్సులు : ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA), ఎంకామ్ (M.Com), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్). అలాగే ఎంఏ (MA) విభాగంలో హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, ఫిలాసఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు ఉన్నాయి. గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు వీటికి అర్హులు.
- యూజీ కోర్సులు : బీఏ , బీకామ్ (B.Com General), బీబీఏ (BBA) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ లేదా 10+2 తత్సమాన విద్య పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు : మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, వేద జ్యోతిష్యం తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఏదేనీ డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
- సర్టిఫికెట్ కోర్సులు : యోగా సర్టిఫికేట్ కోర్సులకు పదో తరగతి (SSC) లేదా తత్సమాన అర్హత, ఇతర సర్టిఫికేట్ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
అన్ని పీజీ కోర్సులు 4 సెమిస్టర్ల (రెండు సంవత్సరాలు) వ్యవధిని, యూజీ కోర్సులు 6 సెమిస్టర్ల (మూడు సంవత్సరాలు) వ్యవధిని కలిగి ఉంటాయి. యోగా సర్టిఫికేట్ కోర్సు రెండు సెమిస్టర్లు (ఒక సంవత్సరం) కాగా… మిగిలిన సర్టిఫికేట్ కోర్సులు 6 నెలల వ్యవధి కలిగి ఉంటాయి.
పీజీ కోర్సులకు బోధనా మాధ్యమం ఇంగ్లీష్‌లో ఉంటుంది (తెలుగు, హిందీ, ఉర్దూ ఎంఏ కోర్సులతో పాటు ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సు తెలుగు మాధ్యమంలో కూడా అందుబాటులో ఉంటుంది). డిగ్రీ (యూజీ) కోర్సులకు ఇంగ్లీష్, తెలుగు బోధనా మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం ఏ కోర్సు నడవాలన్నా కనీసం 50 మంది విద్యార్థుల అడ్మిషన్లు తప్పనిసరిగా ఉండాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్టు 1, 2026
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2026
- ఆన్‌లైన్ తరగతుల ప్రారంభం: అక్టోబర్ 15, 2026
కోర్సుల ఫీజుల వివరాలు, సిలబస్, అర్హతలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విద్యార్థులు PGRRCDE అధికారిక వెబ్‌సైట్ http://www.oucde.net/index.php ను సందర్శించాలని అధికారులు సూచించారు.