...
...
Next Story

OU PhD admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు

Osmania University PhD admissions 2026 : కేటగిరీ-2 పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్శిటీ పొడిగించింది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

Published on: Sep 26, 2026, 13:23:00 IST
Advertisement

Osmania University PhD admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్‌డి (Ph.D.) చేయాలనుకునే వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే కేటరిగి 2 కింద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రాగా… దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 'పీహెచ్‌డి ఎంట్రన్స్ టెస్ట్-2026' ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తు గడువు పొడిగింపు…

ఉస్మానియా వర్శిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఉస్మానియా వర్శిటీలో పీహెచ్డీ ప్రవేశాలు

అర్హులైన అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 5, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. పరిశోధన రంగంలోకి అడుగుపెట్టాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించే ముందు అభ్యర్థులు తమ అర్హత నిబంధనలను, తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించిన సబ్జెక్టుల అందుబాటును జాగ్రత్తగా సరిచూసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సూచించింది. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన తర్వాత పరీక్షకు సంబంధించిన సవరించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలు, నిబంధనలు మరియు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లైన https://www.osmania.ac.in లేదా https://www.ouadmissions.com లను క్రమం తప్పకుండా సందర్శించాలని ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

కేటగిరి - 2 కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎంట్రెన్స్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభ చూపిన వారితో పాటు పాటు సెట్, నెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫైనల్ గా సీట్లు పొందిన వారి వివరాలను డిపార్ట్ మెంట్ల వారీగా విడుదల చేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks