OU PhD admissions 2026 : ఓయూ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ అప్డేట్ - నవంబర్ 14 నుంచి పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ 53 సబ్జెక్టుల పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించింది. నవంబర్ 14 నుంచి 16 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు జరగనున్నాయి. నవంబర్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Oct 19, 2026, 08:04:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ (PhD) అభ్యసించాలనుకుంటున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఓయూ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష తేదీలు
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష తేదీలు

నవంబర్ 14 నుంచి పరీక్షలు….

మొత్తం 53 సబ్జెక్టులకు గాను ఈ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈసారి ప్రవేశ పరీక్షలను పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలోనే నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజూ మూడు వేర్వేరు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో ( https://www.osmania.ac.in/ ) అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి తమ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాలకవర్గం తెలిపింది.

పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షా కేంద్రాలను కేవలం హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

"పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయానికి కనీసం 90 నిమిషాల (గంటన్నర) ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకుని రిపోర్టింగ్ చేయాలి," అని ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి సూచించారు. బయోమెట్రిక్ నమోదు, ఇతర తనిఖీల ప్రక్రియ సులువుగా పూర్తయ్యేందుకే ఈ సమయాన్ని నిర్దేశించినట్లు అధికారులు వెల్లడించారు.

కేటగిరి - 2 కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎంట్రెన్స్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభ చూపిన వారితో పాటు పాటు సెట్, నెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫైనల్ గా సీట్లు పొందిన వారి వివరాలను డిపార్ట్ మెంట్ల వారీగా విడుదల చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More