BRAOU Phd Admissions : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు

BRAOU PhD admissions : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ అయింది. 2025-26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.

Published on: Sep 13, 2026, 08:32:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRAOU PhD admissions : ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) తీపి కబురు అందించింది. 2025-26 విద్యాసంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ (Ph.D.) ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు
అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

మొత్తం ఆరు ప్రధాన విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఇంగ్లీష్, తెలుగు (Telugu), కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ (Sociology) సబ్జెక్టులున్నాయి.

పీహెచ్‌డీ సీట్ల ఎంపికను కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష (CBT), ఆ తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా చేపడతారు. ఈ ప్రవేశ పరీక్షను కేవలం హైదరాబాద్ కేంద్రంలోనే నిర్వహిస్తారు.

యూజీసీ/CSIR-జేఆర్ఎఫ్, నెట్, GATE లేదా CEED పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాసే కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష (CBT) నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే…. ఈ అభ్యర్థులు కూడా నిర్దేశిత రుసుము చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. ఆపై వర్సిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము మరియు నమోదు విధానంఅభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.braoouonline.in ను సందర్శించి ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు.

  • జనరల్ అభ్యర్థులకు నమోదు రుసుము : రూ1,500
  • SC, ST, BC మరియు దివ్యాంగ (PWD) అభ్యర్థులకు రుసుము రూ.1,000

ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదుతో పాటు ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 6, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం విశ్వవిద్యాలయ అధికారులను నేరుగా సంప్రదించవచ్చు

  • డైరెక్టర్ (అకడమిక్): 040-23544741 / 23680411 / 23680414
  • రీసెర్చ్ కోఆర్డినేటర్: 040-23680274
  • కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్: 040-23680240
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More