TG Cheyutha Pension Status : కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
TG Cheyutha Pension Application Status : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పింఛన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారా? మీ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో నమోదైందో లేదో ఆధార్ లేదా అప్లికేషన్ నంబర్‌తో సులభంగా చెక్ చేసుకోవచ్చు.
TG Cheyutha Pension Application Status : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' సామాజిక పింఛన్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వేగంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. మీరు కూడా చేయూత పింఛన్ కోసం అప్లై చేసుకుని ఉంటే…. మీ దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదైందో లేదో మీ ఫోన్ నుంచే సులభంగా చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానాన్ని అధికారులు అత్యంత సరళంగా అందుబాటులోకి తెచ్చారు. మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉపయోగించి స్టేటస్ ఎలా తెలుసుకోవాలో కింద చూడండి….
- ముందుగా చేయూత పథకం అధికారిక పోర్టల్ https://www.cheyutha.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీ ప్రత్యక్షమైన తర్వాత అక్కడ కనిపిస్తున్న 'Quick Search' (క్విక్ సెర్చ్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో కనిపించే 'New Sanctions Applicants Search' అనే లింక్‌ను ఎంచుకోవాలి.
- మీ ఆధార్ నంబర్ లేదా మీ అప్లికేషన్ నంబర్‌ను నిర్దేశిత బాక్స్‌లో సరిగ్గా నమోదు చేయాలి.
- మీ వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఎంట్రీ చేసి ఉంటే, స్క్రీన్‌పై మీ దరఖాస్తు వివరాలు ప్రత్యక్షమవుతాయి.
- ఇందులో మీ అప్లికేషన్ నంబర్‌తో పాటు ఏ కేటగిరీ పింఛన్ (వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల మొదలైనవి) కోసం అప్లై చేశారో ప్రాథమిక సమాచారం కనిపిస్తుంది.
ఈ ఆన్‌లైన్ ఎంట్రీ పూర్తయిన తర్వాత, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన (ఫీల్డ్ వెరిఫికేషన్) జరుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి లేదా పత్రాలను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. విచారణలో అన్ని అర్హతలు ఉన్నాయని తేలితే వెంటనే పింఛన్ మంజూరు చేస్తారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
మరోవైపు ఈ సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. చేయూత పింఛన్ దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన నిరుపేదలు ఈ పొడిగించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వెంటనే సమీపంలోని గ్రామ, వార్డు ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితులు, అర్హతలను స్వయంగా తనిఖీ చేస్తారు. పురపాలక, నగర పాలక సంస్థల బిల్ కలెక్టర్లు ఈ పరిశీలన బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ వేగవంతంగా, అత్యంత పారదర్శకంగా సాగేందుకు స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సహాయాన్ని కూడా తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయి అధికారులు సేకరించిన నివేదికలను మొదట మండల, పట్టణ స్థాయి అధికారులకు పంపుతారు. అక్కడ ప్రాథమిక పరిశీలన పూర్తయిన తర్వాత ఆయా జాబితాలు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోకి వెళ్తాయి. కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతర నివేదికలను తుది అనుమతి కోసం సెర్ప్ ప్రధాన కార్యాలయానికి నివేదిస్తారు. సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన కొత్త పింఛనుదారుల తుది జాబితాను అధికారికంగా ఖరారు చేస్తారు. అర్హులైన పేదలకు ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పింఛన్ డబ్బులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

