...
...
Next Story

TG SET 2026 Results : తెలంగాణ సెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ సెట్-2026 ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ నవంబర్ 27న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 35,003 మందిలో 2,371 మంది ఉత్తీర్ణత సాధించారు.

Published on: Nov 28, 2026, 06:02:24 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్-2026) ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో 29 సబ్జెక్టులకు ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు… అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

టీజీ సెట్ ఫలితాలు - ముఖ్య విషయాలు :

  • రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు: 40,863 మంది
  • పరీక్ష రాసిన అభ్యర్థులు: 35,003 మంది
  • అర్హత సాధించిన అభ్యర్థులు: 2,371 మంది
  • నిర్వహించిన సబ్జెక్టులు: 29

టీజీ సెట్ ఫలితాలు విడుదల
టీజీ సెట్ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానంద రావు, టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ సహా ఇతర అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.

పరీక్ష ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించినందుకు టీజీ సెట్ బృందాన్ని వీసీ అభినందించారు. అంకితభావంతో పనిచేసి పరీక్షను విజయవంతం చేశారని ప్రశంసించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బోధన, పరిశోధన, ఉన్నత విద్య రంగాల్లో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

టీజీ సెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

అభ్యర్థులు ఫలితాలను ఆన్‌లైన్‌లో సులభంగా చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజల్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఫలితం కనిపిస్తుంది. స్కోర్ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

  • టీజీ సెట్ - 2026 అభ్యర్థులు https://telanganaset.org/index.htm వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలోని రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా స్కోర్ కార్డు కాపీని పొందొచ్చు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks