Telangana SIR : ఓటర్ల జాబితాలో మార్పులు - కొత్తగా నమోదుకు 4.88 లక్షల దరఖాస్తులు! ఇప్పటివరకు లెక్కలు ఇలా....
Telangana Voter List Revision 2026 : తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 12,204 ఓట్లను తొలగించినట్లు గురువారం అధికారులు తెలిపారు. ఫారమ్-7 దరఖాస్తులపై కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
Telangana Voter List Revision 2026 : తెలంగాణలోఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ సాగుతోంది. జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు నమోదు చేసిన వినతులు, అభ్యంతరాల సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) గురువారం అధికారికంగా విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఫారమ్-7 కింద 24,323 దరఖాస్తులు రాగా…. క్షేత్రస్థాయి విచారణ అనంతరం అందులో 12,204 పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోనే అత్యధికంగా 6,335 ఫారమ్-7 దరఖాస్తులు అందగా, అందులో 2,066 ఓట్లను అధికారులు తొలగించారు. ఇదే సమయంలో కొత్తగా ఓటరు నమోదు కోసం దాఖలైన ఫారమ్-6 దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4,88,417 నమోదు కావడం విశేషం.
ఫారమ్-7 చుట్టూ వివాదం…!
ఓటర్ల జాబితాలో ప్రతిపాదిత పేర్ల చేర్పులపై అభ్యంతరం తెలపడానికి లేదా అనర్హుల పేర్ల తొలగింపు కోసం ఫారమ్-7 దరఖాస్తును ఉపయోగిస్తారు. అయితే ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ఫారమ్-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్ర రాజకీయ రచ్చ మొదలైంది.
నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు కుట్రపూరితంగా ఫారమ్-7 దరఖాస్తులు సమర్పిస్తున్నారని అధికార కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ వర్గాలు పూర్తిగా తిరస్కరించాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో 151 ఫారమ్-7 దరఖాస్తులు రాగా 87 ఓట్లు, బహదూర్‌పురాలో 842 దరఖాస్తులు రాగా 87 ఓట్లు, గోషామహల్‌లో 222 దరఖాస్తులకు గాను 242 ఓట్లను అధికారులు తొలగించినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే అత్యధికంగా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో 1,509 ఫారమ్-7 దరఖాస్తులు రాగా…. అందులో విచారణ జరిపి 1,241 ఓట్లను తొలగించారు. దీని తర్వాత స్థానంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,026 దరఖాస్తులు రాగా, 161 ఓట్లను అధికారులు తొలగించారు.
ఈ రాజకీయ వివాదంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు స్పందిస్తూ.. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణలోనే జరుగుతోందని స్పష్టం చేశారు. ఫారమ్-7 ద్వారా వచ్చే అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపిన తర్వాతే ఓట్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఆయన వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

