...
...
Next Story

Heavy Vehicle Drivers : 50 శాతానికి పైగా హెవీ వెహికల్స్ డ్రైవర్లలో దృష్టి సమస్యలు!

Heavy Vehicle Drivers : 50 శాతానికి పైగా హెవీ వెహికల్స్ డ్రైవర్లలో దృష్టి సమస్యలు ఉన్నట్టుగా గుర్తించారు. చర్లపల్లిలో నిర్వహించిన కంటి ఆరోగ్య శిబిరంలో ఈ విషయం బయటపడింది.

Published on: Mar 31, 2026, 10:30:02 IST
Advertisement

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, చర్లపల్లిలోని హెచ్‌పీసీఎల్‌లో భారీ మోటారు వాహన డ్రైవర్ల కోసం ఉచిత కంటి ఆరోగ్య శిబిరం నిర్వహించారు. స్క్రీనింగ్‌కు హాజరైన డ్రైవర్లలో సగానికి పైగా కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. శిబిరం సందర్భంగా 76 మంది డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించినట్లు ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు.

కంటి ఆరోగ్య శిబిరం
కంటి ఆరోగ్య శిబిరం

వైద్య బృందాలు దృష్టికి సంబంధించిన అనేక సమస్యలను గుర్తించాయి. ఇందులో ఎనిమిది కంటిశుక్లం కేసులు, 31 మందికి కళ్లజోడు అవసరం కావడం, రెండు రెటీనా సమస్యలు, ఐదు వర్ణాంధత్వ కేసులు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒక కంటితో మాత్రమే చూపు ఉన్నట్లు కూడా కనుగొన్నారు.

డ్రైవర్లు, ముఖ్యంగా భారీ వాహనాలను నడిపే వారు, సరైన దృష్టి ప్రమాణాలను పాటించేలా చూడటం ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రమాదాలను నివారించడంలోనూ, సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను ప్రోత్సహించడంలోనూ ఇటువంటి పరిస్థితులను ముందుగానే గుర్తించడం కీలకం.

రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు.. పోలీసు, పారిశ్రామిక అధికారుల సహకారంతో ఈ శిబిరాన్ని సమన్వయం చేశారు. డీసీపీ రోడ్డు భద్రత, ప్లాంట్ ప్రతినిధులు, స్థానిక పోలీసు సిబ్బందితో సహా సీనియర్ అధికారులు హాజరయ్యారు. డ్రైవర్లు, పారిశ్రామిక కార్మికులలో ఆరోగ్య అవగాహన, నివారణ సంరక్షణపై దృష్టి సారించే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంమలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్లకు మంచి కంటి చూపు బాగుంటేనే ప్రమాదాలను నివారించడం సాధ్యమని ఆదిలాబాద్ ​ఎస్పీ అఖిల్​మహాజన్ పేర్కొన్నారు. బోథ్‌లోని ఓ ఫంక్షన్​ హాలులో నిపుణులైన కంటి డాక్టర్లతో 330 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe