...
...
Next Story

TG New Sarpanches : ఈనెల 19 నుంచి కొత్త సర్పంచులకు శిక్షణ

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు ఉండనున్నాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ) ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వీటిని నిర్వహిస్తారు.

Published on: Jan 15, 2026, 13:36:20 IST
Advertisement

రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్ లు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారంతా ప్రమాణస్వీకారాలు చేయటంతో బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈనెల 19 నుంచి ట్రైనింగ్….

కొత్త సర్పంచులకు శిక్షణ - ప్రభుత్వం ఏర్పాట్లు
కొత్త సర్పంచులకు శిక్షణ - ప్రభుత్వం ఏర్పాట్లు

ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వీటిని పూర్తి చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 12,702 గ్రామాలకు నూతనంగా సర్పంచులు ఎన్నికయ్యారు. వీరందరికీ శిక్షణ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, నిధుల పంపిణీ నిబంధనలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరికి శిక్షణ ఇచ్చే అధికారులు, సిబ్బందిని కూడా నియమించారు.

శిక్షణలో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ప్రతి జిల్లాలోని సర్పంచులను బృందాలు నిర్వహిస్తారు. నిధుల రాబడి, జాయింట్ చెక్ పవర్ తో పాటు మరికొన్ని అంశాలపై అవగాహన తరగతులు చేపడుతారు.

సర్పంచుల శిక్షణ పూర్తయిన తర్వాత ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు డివిజన్, మండల కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఆ దిశగా కూడా పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసభల నిర్వహణ, పంచాయతీ సమావేశాలు, జనన, మరణాల నమోదు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పథకం అమలతో పాటు ఇతర అంశాలపై శిక్షణ ఇస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe