దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో ‘పానోస్కోపీ’ టెక్నాలజీ ప్రారంభం! కీళ్లు, స్పోర్ట్స్ ఇంజ్యురీస్ చికిత్సలో పెను మార్పులు

ఆర్థోపెడిక్ వైద్య రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కీళ్ల నొప్పులు, క్రీడల గాయాలకు (Sports Injuries) అత్యాధునిక పరిష్కారాన్ని చూపే 'పానోస్కోపీ' (PANOSCOPY) సాంకేతికతను దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లోని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Published on: Mar 25, 2026, 16:51:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ ఆర్థోపెడిక్ చికిత్సలో ఒక కొత్త శకం మొదలైంది. భుజం, మోచేయి, మణికట్టు, మోకాలి సమస్యలతో పాటు లిగమెంట్ సమస్యలు, కండరాల గాయాలకు అత్యంత కచ్చితత్వంతో చికిత్స అందించే విప్లవాత్మక 'పానోస్కోపీ' సాంకేతికతను కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ (బేగంపేట) బుధవారం అధికారికంగా ప్రారంభించింది.

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, సహచర వైద్య నిపుణులు
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, సహచర వైద్య నిపుణులు

గుర్తించలేని గాయాలకు ‘పానోస్కోపీ’తో చెక్

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి మాట్లాడారు.

“సాధారణంగా వాడే ఆర్థ్రోస్కోపీ టెక్నాలజీ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దాని ద్వారా కీళ్లలోని కొన్ని లోతైన లేదా సంక్లిష్టమైన గాయాలను గుర్తించడం కష్టమవుతుంది. ఎందుకంటే అందులో పరిమితమైన వీక్షణ (Field of vision) మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన పానోస్కోపీ టెక్నాలజీ ద్వారా కీళ్ల లోపల ప్రతి భాగాన్ని అత్యంత స్పష్టంగా, వైడ్ వ్యూలో చూడవచ్చు. దీనివల్ల వ్యాధి నిర్ధారణ కచ్చితంగా జరగడమే కాకుండా, సర్జరీ తర్వాత మెరుగైన ఫలితాలు వస్తాయి” అని డాక్టర్ గురవారెడ్డి వివరించారు.

బ్లైండ్ స్పాట్స్ లేని చికిత్స

పానోస్కోపీ సాంకేతికత ఆర్థోపెడిక్ సర్జరీల్లో పెను మార్పులు తీసుకువస్తుందని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

“గతంలో ఆపరేషన్ సమయంలో కంటికి కనిపించకుండా పోయే (Blind spots) చిన్నపాటి గాయాలను కూడా ఈ టెక్నాలజీ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా భుజం జారడం (Shoulder Dislocation), రొటేటర్ కఫ్ టియర్స్, ఫ్రోజన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో మరియు మోకాలి లిగమెంట్ గాయాలకు చికిత్స చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోగులు వేగంగా కోలుకోవడానికి, దీర్ఘకాలిక ఫలితాలను పొందడానికి పానోస్కోపీ ఎంతగానో తోడ్పడుతుంది” అని డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

కీలక ప్రయోజనాలు ఇవే:

  • సంపూర్ణ వీక్షణ: కీళ్ల లోపల దాగి ఉండే అతి చిన్న గాయాలను కూడా స్పష్టంగా చూడవచ్చు.
  • కచ్చితమైన సర్జరీ: డాక్టర్లకు మెరుగైన విజువల్స్ అందడం వల్ల శస్త్రచికిత్సలో లోపాలకు తావుండదు.
  • వేగంగా కోలుకోగలగడం: గాయం తీవ్రతను బట్టి కచ్చితమైన చికిత్స అందడం వల్ల రోగులు త్వరగా సాధారణ స్థితికి వస్తారు.
  • వరల్డ్ క్లాస్ కేర్: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ వైద్యం ఇప్పుడు మన హైదరాబాద్‌లోనే అందుబాటులోకి రావడం విశేషం.

సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ ఎల్లప్పుడూ ప్రపంచస్థాయి వైద్య సాంకేతికతను భారతీయులకు అందించడంలో ముందుంటుందని, ఈ పానోస్కోపీ లాంచ్ అందులో ఒక భాగమేనని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More