దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ డివిజన్‌లో మౌలిక వసతుల ఆధునీకీకరణ పనులు వేగవంతమయ్యాయి. నాగర్ సోల్ - తారూ స్టేషన్ల మధ్య ట్రాక్ డబ్లింగ్ (రెండో రైల్వే లైన్), విద్యుదీకరణ, సిగ్నలింగ్ పనులను ప్రారంభించడంలో భాగంగా నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ సాంకేతిక పనుల కారణంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే పలు కీలక రైళ్లను కొన్ని నిర్దిష్ట తేదీల్లో పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు :
- చెన్నై – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 16003): డిసెంబర్ 6, 2026న బయలుదేరే ఈ రైలు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది. ఈ రైలు రొటేగాం వరకు మాత్రమే నడుస్తుంది.
- నాగర్సోల్ – చెన్నై (రైలు సంఖ్య: 16004): డిసెంబర్ 7, 2026న నాగర్ సోల్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఈ రైలు నాగర్ సోల్ కు బదులుగా రొటేగాం నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
- నరసాపూర్ – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 17231): డిసెంబర్ 4, 2026 మరియు డిసెంబర్ 6, 2026 తేదీల్లో బయలుదేరే ఈ రైలు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది.
- నాగర్ సోల్ – నరసాపూర్ (రైలు సంఖ్య: 17232) : డిసెంబర్ 5, 2026 మరియు డిసెంబర్ 7, 2026 తేదీల్లో నాగర్ సోల్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఈ రైలు రొటేగాం నుంచే బయలుదేరుతుంది.
- నరసాపూర్ – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 12787): నవంబర్ 30, 2026 నుండి డిసెంబర్ 3, 2026 వరకు, అలాగే డిసెంబర్ 5, 7, 8, 9 తేదీల్లో బయలుదేరే ఈ రైలు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది.
- నాగర్ సోల్ – నరసాపూర్ (రైలు సంఖ్య: 12788): డిసెంబర్ 1, 2, 3, 4, 6, 8, 9, 10 తేదీల్లో ఈ రైలు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఇది రొటేగాం నుంచే ప్రారంభమవుతుంది.
- మన్మాడ్ – ధర్మాబాద్ (రైలు సంఖ్య: 17687): డిసెంబర్ 1, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు మన్మాడ్ – లసూర్ మధ్య పాక్షికంగా రద్దయింది.
- ధర్మబాద్ – మన్మాడ్ (రైలు సంఖ్య: 17688): డిసెంబర్ 1, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు లసూర్ – మన్మాడ్ మధ్య రద్దయింది.
- మన్మాడ్ – హెచ్.ఎస్.నాందేడ్ (రైలు సంఖ్య: 57652): డిసెంబర్ 9, 2026 మరియు డిసెంబర్ 10, 2026 తేదీల్లో మన్మాడ్ – లసూర్ మధ్య పాక్షికంగా రద్దయింది. •
- హెచ్.ఎస్.నాందేడ్ – మన్మాడ్ (రైలు సంఖ్య: 57651): డిసెంబర్ 8, 2026 మరియు డిసెంబర్ 9, 2026 తేదీల్లో లసూర్ – మన్మాడ్ మధ్య రద్దయింది.
- కాచిగూడ – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 17661): డిసెంబర్ 3, 2026 నుంచి డిసెంబర్ 9, 2026 వరకు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది.
- నాగర్ సోల్ – కాచిగూడ (రైలు సంఖ్య: 17662): డిసెంబర్ 4, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఈ రైలు రొటేగాం నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}