తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - పలు రైళ్లు పాక్షికంగా రద్దు! తేదీలవారీగా వివరాలివే

నాగార్ సోల్–తారూ సెక్షన్లలో నాన్-ఇంటర్ లాకింగ్, ట్రాక్ డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే పలు రైళ్లున్నాయి.

Published on: Sep 27, 2026, 06:46:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ డివిజన్‌లో మౌలిక వసతుల ఆధునీకీకరణ పనులు వేగవంతమయ్యాయి. నాగర్ సోల్ - తారూ స్టేషన్ల మధ్య ట్రాక్ డబ్లింగ్ (రెండో రైల్వే లైన్), విద్యుదీకరణ, సిగ్నలింగ్ పనులను ప్రారంభించడంలో భాగంగా నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ సాంకేతిక పనుల కారణంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే పలు కీలక రైళ్లను కొన్ని నిర్దిష్ట తేదీల్లో పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు

పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు :

  • చెన్నై – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 16003): డిసెంబర్ 6, 2026న బయలుదేరే ఈ రైలు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది. ఈ రైలు రొటేగాం వరకు మాత్రమే నడుస్తుంది.
  • నాగర్సోల్ – చెన్నై (రైలు సంఖ్య: 16004): డిసెంబర్ 7, 2026న నాగర్ సోల్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఈ రైలు నాగర్ సోల్ కు బదులుగా రొటేగాం నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
  • నరసాపూర్ – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 17231): డిసెంబర్ 4, 2026 మరియు డిసెంబర్ 6, 2026 తేదీల్లో బయలుదేరే ఈ రైలు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది.
  • నాగర్ సోల్ – నరసాపూర్ (రైలు సంఖ్య: 17232) : డిసెంబర్ 5, 2026 మరియు డిసెంబర్ 7, 2026 తేదీల్లో నాగర్ సోల్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఈ రైలు రొటేగాం నుంచే బయలుదేరుతుంది.
  • నరసాపూర్ – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 12787): నవంబర్ 30, 2026 నుండి డిసెంబర్ 3, 2026 వరకు, అలాగే డిసెంబర్ 5, 7, 8, 9 తేదీల్లో బయలుదేరే ఈ రైలు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది.
  • నాగర్ సోల్ – నరసాపూర్ (రైలు సంఖ్య: 12788): డిసెంబర్ 1, 2, 3, 4, 6, 8, 9, 10 తేదీల్లో ఈ రైలు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఇది రొటేగాం నుంచే ప్రారంభమవుతుంది.
  • మన్మాడ్ – ధర్మాబాద్ (రైలు సంఖ్య: 17687): డిసెంబర్ 1, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు మన్మాడ్ – లసూర్ మధ్య పాక్షికంగా రద్దయింది.
  • ధర్మబాద్ – మన్మాడ్ (రైలు సంఖ్య: 17688): డిసెంబర్ 1, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు లసూర్ – మన్మాడ్ మధ్య రద్దయింది.
  • మన్మాడ్ – హెచ్.ఎస్.నాందేడ్ (రైలు సంఖ్య: 57652): డిసెంబర్ 9, 2026 మరియు డిసెంబర్ 10, 2026 తేదీల్లో మన్మాడ్ – లసూర్ మధ్య పాక్షికంగా రద్దయింది. •
  • హెచ్.ఎస్.నాందేడ్ – మన్మాడ్ (రైలు సంఖ్య: 57651): డిసెంబర్ 8, 2026 మరియు డిసెంబర్ 9, 2026 తేదీల్లో లసూర్ – మన్మాడ్ మధ్య రద్దయింది.
  • కాచిగూడ – నాగర్ సోల్ (రైలు సంఖ్య: 17661): డిసెంబర్ 3, 2026 నుంచి డిసెంబర్ 9, 2026 వరకు రొటేగాం – నాగర్ సోల్ మధ్య పాక్షికంగా రద్దయింది.
  • నాగర్ సోల్ – కాచిగూడ (రైలు సంఖ్య: 17662): డిసెంబర్ 4, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు నాగర్ సోల్ – రొటేగాం మధ్య రద్దయింది. ఈ రైలు రొటేగాం నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More