...
...
Next Story

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం - జనసేన అధినేత పవన్ పర్యటన రద్దు..!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ ప్రచార పర్యటన రద్దైంది. ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో షెడ్యూల్ లో ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు తెలిపారు.

Published on: Feb 7, 2026, 14:37:54 IST
Advertisement

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చిన సంగతి తెలిసింద. పలుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్

జనసేన - బీజేపీ పార్టీల ప్రకటన ప్రకారం… ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో పవన్ పర్యటన రద్దు అయింది. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో షెడ్యూల్ లో ఇబ్బందుల కారణంగా కళ్యాణ్ పర్యటన రద్దు చేసినట్లు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ శనివారం తెలిపారు.

ఇక పవన్ పర్యటన ఖరారైన వెంటనే తెలంగాణలోని అధికార కాంగ్రెస్ నుంచి మాటల దాడి మొదలైంది. గతంలో కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలను తెరపైకి తీసుకువచ్చారు. ఇటీవలే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో తెలంగాణ గురించి చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌లు ప్ర‌జ‌లు మ‌ర్చిపోయార‌ని తాను అనుకోవ‌ట్లేద‌న్నారు. దిష్టి వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చిన త‌ర‌వాత‌నే ప‌వ‌న్ ప్ర‌చారం చేయాల‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర మోక‌రిల్లాల్సిన ప‌రిస్థితి బీజేపీకి ఎందుకు వ‌చ్చింద‌ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇతర నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ… బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇటీవలే కొండగట్టు పర్యటనకు వచ్చిన సమయంలోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈసారి తప్పకుండా పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణలోని నాయకత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ తరపున పలుచోట్ల నామినేషన్లను కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 336 వార్డుల్లో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ జనసేన నాయకత్వం ప్రకటించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe