Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు - పరిస్థితి విషమం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కొనసాగుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated on: Jul 26, 2026, 10:54:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి

గుండెపోటుతో ఆస్పత్రికి తరలింపు…

ప్రాథమిక సమాచారం ప్రకారం…. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం సడన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, ఆయనను చికిత్స నిమిత్తం అత్యవసరంగా వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యులు ఆయన్ను కాపాడేందుకు శ్రమిస్తున్నారు.

విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తమ పర్యటనలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ బయల్దేరి వెళ్లారు.

ఎలాంటి ఇబ్బంది లేదు - వైద్యులు

రోహిణి హాస్పిటల్ సూపరిండెంట్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సీపీఆర్ జరుగుతుందని వివరించారు. మరణ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. హార్ట్ బీట్ వచ్చిందని… ప్రస్తుతం నిలకడగా ఉన్నాడని పేర్కొన్నారు.

మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఉన్న అంబులెన్స్ వెంటే కేటీఆర్, హరీశ్ రావ్ బయల్దేరారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి… ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

ఉద్యమ నాయకుడిగా నర్సంపేట నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్వప్నం సాకారమైన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన విజయాన్ని అందుకోలేకపోయారు.

ఓటమితో కుంగిపోకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ సమస్యలపై పోరాటం సాగించారు. దాని ఫలితంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికై, 2018 నుంచి 2023 వరకు ఐదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More