Petrol price Hyderabad : దేశవ్యాప్తంగా పోల్చుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం ప్రకటించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రేట్లకు రెక్కలొచ్చాయి. ఫలితంగా సామాన్యుడి జేబుకు పడిన చిల్లు మరింత పెరిగింది! ప్రాంతాన్ని బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు కనీసం రూ. 3 చొప్పున పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలను ఇక్కడ తెలుసుకోండి..
తెలంగాణాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ. 3.39 పెరిగి రూ. 110.89కి చేరింది. లీటరు డీజిల్ ధర రూ. 3.26 పెరిగి రూ. 98.96గా ఉంది.
వరంగల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 3.48 పెరిగి రూ. 110.53గాను, లీటరు డీజిల్ ధర రూ. 3.34 పెరిగి రూ. 98.65గాను ఉన్నాయి.
నల్గొండలో లీటరు పెట్రోల్ ధర రూ. 3.39 పెరిగి రూ. 1110.99గా ఉంది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 3.27 పెరిగి రూ. 99.08గా ఉంది.
సిద్ధిపేట్లో లీటరు పెట్రోల్ ధర రూ. 3.39 పెరిగి రూ. 110.88గాను, లీటరు డీజిల్ ధర రూ. 3.26 పెరిగి రూ. 98.99గాను ఉన్నాయి.
ఇక సూర్యపేట్లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.73 (+3.61), లీటరు డీజిల్ ధర రూ. 98.82 (+3.46)గాను ఉన్నాయి.
యాదాద్రి భువనగిరిలో లీటరు పెట్రోల్ ధర రూ. 2.84 పెరిగి రూ. 110.57కి చేరింది. లీటరు డీజిల్ ధర రూ. 2.77 పెరిగి రూ. 98.70కి వెళ్లింది.
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ. 113.03 (+3.29)గాను, లీటరు డీజిల్ ధర రూ. 100.71 (+3.14)గాను ఉన్నాయి.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ. 111.74 (+3.39)గాను, లీటరు డీజిల్ ధర రూ. 99.47 (+3.25)గాను ఉన్నాయి.
{{/usCountry}}విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ. 111.74 (+3.39)గాను, లీటరు డీజిల్ ధర రూ. 99.47 (+3.25)గాను ఉన్నాయి.
{{/usCountry}}గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ. 3.05 పెరిగి రూ. 112.79కి వెళ్లింది. అదే సమయంలో లీటరు డీజిల్ ధర రూ. 2.92 పెరిగి రూ. 100.49ని తాకింది.
కర్నూల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 2.35 పెరిగి రూ. 112.96కి చేరింది. లీటరు డీజిల్ ధర రూ. 2.27 పెరిగి రూ. 100 మార్కును హిట్ చేసింది.
తిరుపతిలో లీటరు పెట్రోల్, లీటర్ డీజిల్ ధరలు వరుసగా రూ. 112.33 (+3.29), రూ. 100.01 (+3.14)గా ఉన్నాయి.
కాకినాడలో లీటరు పెట్రోల్ ధర రూ. 3.29 పెరిగి రూ. 113.13కి చేరింది. లీటరు డీజిల్ ధర రూ. 3.15 పెరిగి రూ. 100.76కి వెళ్లింది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలా..
దిల్లీ: పెట్రోల్ ధర రూ. 94.77 నుంచి రూ. 97.77 కి చేరింది. డీజిల్ రూ. 89.67 నుంచి రూ. 90.67 కి పెరిగింది.
ముంబై: పెట్రోల్ లీటరుపై రూ. 3.14 పెరిగి రూ. 106.68 కి చేరుకుంది.
కోల్‌కతా: గరిష్టంగా రూ. 3.29 పెరగడంతో పెట్రోల్ ధర రూ. 108.74 కి చేరింది.
చెన్నై: రూ. 2.83 పెంపుతో పెట్రోల్ ధర రూ. 103.67 వద్ద ఉంది.
బెంగళూరు : రూ. 3.2 పెంపుతో పెట్రోల్ ధర రూ. 106.21గాను, రూ. 3.11 పెంపుతో లీటరు డీజిల్ ధర రూ. 94.10గాను ఉన్నాయి.