...
...
Next Story

భద్రాచలం ఆలయ రీడెవలప్‌మెంట్ ఫేజ్-1 పనులు ప్రారంభం

భద్రాచలం ఆలయ రీడెవలప్‌మెంట్ ఫేజ్-1 పనులు ప్రారంభమయ్యాయి. రూ.351 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Published on: Jun 28, 2026, 14:19:21 IST
Advertisement

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పునరుద్ధరణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి విడత (ఫేజ్-1) అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో భద్రాద్రి కొత్త శోభను సంతరించుకోనుంది.

భద్రాచలం సీతారామ ఆలయం
భద్రాచలం సీతారామ ఆలయం

ఈ ఏడాది మార్చిలోనే భద్రాచలం 17వ శతాబ్దపు పురాతన ఆలయ పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 351 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక ఉట్టిపడేలా తీర్చిదిద్దడమే కాకుండా, భక్తులకు అవసరమైన ఆధునిక వసతులను కల్పించనున్నారు.

ఆలయ వర్గాల సమాచారం ప్రకారం.. భద్రాచలం క్షేత్రంతో పాటు స్థానిక పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ పనులన్నీ సంప్రదాయ ఆగమ శాస్త్రాల నియమాలను కచ్చితంగా పాటిస్తూ మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు.

మొదటి విడతలో భాగంగా ఆలయ గర్భాలయం, ప్రాకారం, అంతర్గత నిర్మాణాల పునరుద్ధరణ పనులు చేస్తారు. రెండో విడత భక్తుల వసతి గృహాలు, కల్యాణ మండపం, క్యూలైన్ల ఆధునీకరణ చేపట్టనున్నారు. మూడో విడతలో భాగంగా భద్రాచలం పట్టణ ప్రణాళిక, గోదావరి ఘాట్ల అభివృద్ధి, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేస్తారు.

చారిత్రాత్మక నేపథ్యం దెబ్బతినకుండా, భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని విస్తరించనున్నారు. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ కాంప్లెక్స్‌లు, ప్రసాదం కౌంటర్లు, విశ్రాంతి గదులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ పునర్నిర్మాణ పనుల ద్వారా భద్రాచలం పట్టణం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe