...
...
Next Story

OU PhD Notification 2026 : ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం

Osmania University PhD Notification 2026 : ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) నుంచి కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: May 22, 2026 12:55 PM IST
Advertisement

Osmania University PhD Notification 2026 : ప్రఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) లో పరిశోధన చేయాలనుకునే అభ్యర్థులకు ఓయూ అడ్మిషన్ల విభాగం కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 విద్యాసంవత్సరానికి గాను వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 (Category-I) కింద పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై, జేఆర్‌ఎఫ్ సాధించిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూల ద్వారా పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం…

ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా… ఇటీవలనే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఓయూ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కేటగిరీ-1 పీహెచ్‌డీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణులై, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొంది ఉండాలి.

  • యూజీసీ నెట్ (UGC-JRF) / సీఎస్ఐఆర్ నెట్ (CSIR-JRF)
  • ఐసీఎంఆర్ (ICMR), ఐసీఏఆర్ (ICAR)
  • డీబీటీ (DBT), ఇన్‌స్పైర్ (INSPIRE) ఫెలోషిప్
  • ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ (NFSC) మరియు ఎన్‌ఎఫ్‌ఎస్‌టీ (NFST) వంటి జాతీయ స్థాయి ఫెలోషిప్‌లు సాధించిన వారు మాత్రమే ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థులు ఈ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచార బ్రోచర్, పీహెచ్‌డీ గైడ్‌లైన్స్, నిబంధనల వివరాలను www.osmania.ac.in లేదా www.ouadmissions.com లలో సందర్శించి తెలుసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు గడువు ముగిసేలోగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు,

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON