...
...
Next Story

బొట్టు పెట్టి చీరల పంపిణీ.. ఫొటో, ఆధార్ తప్పనిసరి.. ఇందిరమ్మ చీరలకు ప్రభుత్వ గైడ్‌లైన్స్!

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ చీరల పంపిణీ కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

Published on: Nov 20, 2025, 10:38:19 IST
Advertisement

రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మెుదలైంది. కోటి మందికి కోటి చీరలు అని ప్రభుత్వం చెబుతోంది. రెండు దశల్లో ఈ చీరల పంపిణీ చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(SERP) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కీలక విషయాలను వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ఓ పండుగ వాతావరణంగా చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

ఇందిరమ్మ చీరల పంపిణీకి మార్గదర్శకాలు
ఇందిరమ్మ చీరల పంపిణీకి మార్గదర్శకాలు

మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులైన ఇంటింటికీ వెళ్లాలి. బొట్టి పెట్టి మరీ చీరలను లబ్ధిదారులకు అందజేయాలని సెర్ప్ స్పష్టం చేసింది. మెుదట మండల స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే గ్రామాల్లో పంపిణీ మెుదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం సబ్‌కలెక్టర్లు, ఆర్డీఓలు పర్యవేక్షలుగా ఉంటారు.

లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలి, చీరను తీసుకున్నట్టుగా ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా రికార్డు చేయాలి. దీనిపై నివేదికను జిల్లా కలెక్టర్లు సెర్ప్ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ కార్యక్రమంలో సెర్ప్ సభ్యులు ముఖ గుర్తింపు యాప్ ద్వారా వారి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేసి, లబ్ధిదారుల ఫొటోను తీసి చీర అందజేస్తారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యులు కాకుంటే వారు ముందుగా సభ్యత్వం నమోదు చేసిన తర్వాత చీరలు పొందుతారు.

18 ఏళ్లు పైబడిన మహిళలకు చీరలు అందుతాయి. మరోవైపు 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న బాలికలు సల్వార్ కమీజ్ లేదంటే లంగా ఓణీలను ఇవ్వడంపై సెర్ప్ ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks