Hyderabad : రూ. 6 లక్షలకు డీల్... 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన సీఐ!

Mirchowk Inspector Bribe Case : రూ. 3 లక్షలు తీసుకుంటూ మీర్‌చౌక్ పోలీసు స్టేషన్ సీఐ కొండల్ రావు ఏసీబీకి చిక్కారు. ఇదే కేసులో హోంగార్డ్ ఆబిద్ అలీల్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ మేరకు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Oct 28, 2026, 07:24:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలోని మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో లంచావతారం ఎత్తిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)… ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఓ కేసు నుంచి ఉపశమనం కల్పించేందుకు ఏకంగా లక్షల్లో లంచం డిమాండ్ చేసి…. ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా పట్టుబడ్డాడు.

ఏసీబీకి చిక్కిన సీఐ
ఏసీబీకి చిక్కిన సీఐ

రూ. 6 లక్షలకు డీల్..

ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం…. మీర్‌చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫిర్యాదుదారుడి తండ్రిపై నమోదైన కేసును క్లోజ్ చేయడానికి, అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటానికి, భవిష్యత్తులో పోలీసు సాయం అందించడానికి సీఐ ఎం. కొండల్ రావు రూ. 6 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే…. మొదటి విడతగా రూ. 3 లక్షల లంచం మొత్తాన్ని పోలీసు స్టేషన్ పరిధిలోని హోంగార్డ్ ఆబిద్ అలీ ద్వారా స్వీకరించేందుకు నిర్ణయించారు.

బాధితుడు ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ సిటీ రేంజ్-1 బృందం పక్కా వ్యూహంతో దాడి నిర్వహించింది. ఫిర్యాదుదారుడి నుంచి హోంగార్డ్ ఆబిద్ అలీ రూ. 3 లక్షల లంచం నగదు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. హోంగార్డ్ స్వాధీనం నుంచి ఆ లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

సీఐ కొండల్ రావు, హోంగార్డ్ ఆబిద్ అలీపై కేసు నమోదు చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను రహస్యంగా ఉంచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కోణాల్లో సమగ్ర విచారణ కొనసాగుతోంది.

ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది ఎవరైనా అధికారిక పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ ప్రజలను కోరింది. బాధితులు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More