Telangana ACB : ఏసీబీ వలకు చిక్కిన సివిల్‌ సప్లయ్‌ ఆఫీసర్‌ - భారీగా ఆస్తులు బట్టబయలు!

మహబూబాబాద్ సివిల్ సప్లైస్ అధికారి ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహంచారు. దాదాపు రూ.9.41 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.

Published on: Oct 10, 2026, 12:15:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మహబూబాబాద్ జిల్లా సివిల్ సప్లైస్ శాఖలో పనిచేస్తున్న జిల్లా మేనేజర్‌ (టెక్నికల్‌) వీ నరసింహారావుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేంది. ఇందులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు శుక్రవారం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సదరు అధికారితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన ఏడు విభిన్న ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు చేపట్టారు.

నరసింహారావు
నరసింహారావు

భారీగా ఆస్తులు…..

ప్రాథమిక విచారణలో భాగంగా ఏసీబీ బృందాలు పెద్ద ఎత్తున ఆస్తులను బట్టబయలు చేశారు. ఇందులో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, భవనాలు, నివాస గృహాలు వంటి స్థిరాస్తులతో పాటు వాహనాలు, విలువైన గృహోపకరణాలు, భారీగా బంగారు, వెండి ఆభరణాల వంటి చరాస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల అధికారిక రిజిస్ట్రేషన్ దస్తావేజుల విలువ సుమారు రూ. 9.41 కోట్లుగా ఉంది. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఈ స్థిరాస్తుల ధర డాక్యుమెంట్ విలువల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

సోదాల్లో భాగంగా లభ్యమైన పత్రాల ప్రకారం నరసింహారావు, ఆయన భార్య పేర్లపై ఖమ్మం జిల్లాలోని బల్లెపల్లి, రఘునాథపాలెం, వెలుగుమట్ల ప్రాంతాల్లో మొత్తం 1,230.16 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 5 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ దస్తావేజుల విలువ రూ.30.72 లక్షలుగా ఉంటుంది. సూర్యాపేట జిల్లా కల్మల చెరువు వద్ద 1.08 ఎకరాలు, సిరికొండ వద్ద 21.3 ఎకరాలు (ఆయన మరియు ఆయన మామ పేరుపై), సూర్యాపేట జిల్లా మోతే మండలం నమావరం వద్ద చెరో 5.31 ఎకరాల చొప్పున రెండు వ్యవసాయ భూములు ఉన్నాయి. సిరికొండ భూమి రికార్డుల విలువ రూ.76 లక్షలు కాగా అగ్రిమెంట్ విలువ రూ.6.54 కోట్లుగా ఉంది.

నమావరం భూముల రికార్డు విలువ రూ.19.25 లక్షలు కాగా అగ్రిమెంట్ విలువ రూ.1.92 కోట్లుగా నమోదు చేశారు. మొత్తం వ్యవసాయ భూముల రికార్డుల విలువ రూ.1.17 కోట్లుగా ఉంది. ఇక నివాస గృహాల విషయానికి వస్తే ఖమ్మం కవిరాజ్ నగర్‌లో జి+2, జి+4 ఆర్‌సిసి భవనాలు, ఎల్‌బి నగర్ బైరామల్‌గూడ సాగర్ ఎన్‌క్లేవ్‌లో నరసింహారావు, ఆయన భార్య, మామ పేరుపై గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి దస్తావేజుల విలువ రూ.1.58 కోట్లుగా లెక్కించారు. చరాస్తులు మరియు నగదు:

సోదాల్లో రూ.18.49 లక్షల విలువైన హ్యుందాయ్ క్రెటా కారు, రూ.1.05 లక్షల విలువైన టీవీఎస్ జూపిటర్, రూ.50 వేల విలువైన హోండా యాక్టివా ద్విచక్రవాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి గృహోపకరణాల విలువ రూ.33.48 లక్షలుగా నిర్ణయించారు. అధికారి నివాసంలో 360.97 గ్రాముల బంగారం, 331.58 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. వీటి మొత్తం విలువ రూ.9.39 లక్షలు. అలాగే రూ.15,600 నగదును సీజ్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు. గుర్తించిన ఆస్తుల యాజమాన్య హక్కులు, వాటిని కొనుగోలు చేసిన మార్గాలు, ఆర్థిక లావాదేవీలు మరియు నిధుల మూలాలపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More