ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు సీనియర్ సిటిజన్లకు డే కేర్ సెంటర్లు

వృద్ధుల కోసం తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ కేర్ తీసుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ కేంద్రాలు ప్లాన్ చేసింది.

Published on: Jan 15, 2026, 15:02:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. వారానికి ఒకసారి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఉచితంగా అందిస్తారు. పుస్తకాలు, ఇండోర్ క్రీడల కోసం కొన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కేంద్రాలను నడపడానికి మార్గదర్శకాలను రూపొందించారు.

ప్రణామ్ డే కేర్ సెంటర్లు
ప్రణామ్ డే కేర్ సెంటర్లు

ఈ కేంద్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 12న ప్రారంభించిన విషయం తెలిసిందే. వృద్ధులలో సామాజిక సంబంధాలను ప్రోత్సహించడం ద్వారా వారి మానసిక శ్రేయస్సుకు దోహదపడటానికి ఈ డే కేర్ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఒంటరితనంతో కుమిలిపోతున్న సీనియర్ సిటిజన్లకు ఈ ప్రణామ్ డే కేర్ కేంద్రాలు ఎంతగానో ఉపశమనం కలిగించనున్నాయి. కన్నబిడ్డలు ఉద్యోగాలతో బిజీగా మారిపోవడం, మనమళ్లు, మనమరాళ్లు స్కూళ్లకు వెల్లడంతో ఇంట్లో ఉంటున్న వృద్ధులకు ఈ కేంద్రాలు సంతోషాన్నివ్వనున్నాయి.

ప్రభుత్వం ఇటువంటి 37 కేంద్రాలను ఆమోదించింది. వీటిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాలల్లో రెండు కేంద్రాలు ఉంటాయి. వచ్చే వారం నాటికి వనరులు పూర్తిగా ఏర్పాటు అవుతాయి.

కుటుంబ సభ్యులు పనిలో నిమగ్నమై ఉండటంతో చాలా మంది వృద్ధులకు మాట్లాడటానికి ఎవరూ ఉండరు. ఈ చొరవ వృద్ధులు ఒకచోట చేరి, ఇతరులతో కలిసిమెలిసి ఉండటానికి సహాయపడుతుంది. రోజుకు ఒకసారి ప్రాథమిక పౌష్టికాహారాన్ని అందిస్తారు. ఎప్పుడైనా వచ్చి, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. వృద్ధాప్యంలో ఎదురయ్యే ఒంటరితనాన్ని అధిగమించడానికి ఇది సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి డే కేర్ సెంటర్‌కు సంవత్సరానికి సుమారు రూ.12 లక్షలు ఆమోదించిందని, ఈ నిధులు ప్రతి సంవత్సరం విడుదల అవుతాయని తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలోని జెరియాట్రిక్ వార్డులతో ఈ కేంద్రాలను అనుసంధానించడానికి, సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సులు నిర్వహించడానికి పోలీసులతో సమన్వయం చేసుకోవడానికి, వృద్ధుల శ్రేయస్సు కోసం బహిరంగ కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

మధ్యాహ్నం వేడి వేడి భోజనం, లైబ్రరీ, ఇంటర్నెట్ కనెక్షన్‌తో కంప్యూటర్, వైద్య తనిఖీ మరియు మందులు, ఇండోర్ క్రీడలు, వైద్య సేవలు, వారానికి ఒకసారి ప్రాథమిక వైద్య తనిఖీ, వైద్యుని ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ప్రాథమిక మందులు ఉచితంగా అందిచడం ఉంటాయి. సేద తీరేందుకు గార్డెనింగ్, మెుక్కల పెంపకం లాంటివి ఉంటాయి. 60 ఏళ్లు పైబడినవారు ఈ సెంటర్లలో రిజిస్టర్ చేసుకుని సేవలు పొందవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More