తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు పెద్ద మొత్తంలో నిరసించారు. తమ హక్కుల కోసం పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు.

పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని అదే విధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు క్యా లెస్ హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లు విడుదల చేయాలని, అదే విధంగా ఈ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టో చేర్చిన విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
సచివాలయ ఉద్యోగులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గిరి శ్రీనివాసరెడ్డి, సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి, సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షులు జి.సురేష్ కుమార్, సచివాలయ ఉద్యోగుల సహకార సొసైటీ అధ్యక్షులు రేండ్ల రాజేష్, వివిధ సంఘాల నాయకులు పెద్ద మొత్తంలో జేఏసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు జేఏసీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మండల తహశీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్టీఓలకు ఉద్యోగులు వినతిపత్రాలు అందించారు.
'52 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యంతో రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ రెండో తేదీన పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐదు డీఏలను కూడా విడుదల చేయాలి.' అని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
{{/usCountry}}'52 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యంతో రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ రెండో తేదీన పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐదు డీఏలను కూడా విడుదల చేయాలి.' అని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
{{/usCountry}}రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని ఉద్యోగులు అన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలి విజ్ఞప్తి చేశారు.