హెల్త్ స్కీమ్, పీఆర్సీ అమలు : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు!

Telangana Govt Employees Protest : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Updated on: Apr 17, 2026, 18:25:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు పెద్ద మొత్తంలో నిరసించారు. తమ హక్కుల కోసం పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు.

తెలంగాణలో ఉద్యోగుల నిరసన
తెలంగాణలో ఉద్యోగుల నిరసన

పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని అదే విధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు క్యా లెస్ హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లు విడుదల చేయాలని, అదే విధంగా ఈ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టో చేర్చిన విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.

సచివాలయ ఉద్యోగులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గిరి శ్రీనివాసరెడ్డి, సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి, సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షులు జి.సురేష్ కుమార్, సచివాలయ ఉద్యోగుల సహకార సొసైటీ అధ్యక్షులు రేండ్ల రాజేష్, వివిధ సంఘాల నాయకులు పెద్ద మొత్తంలో జేఏసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు జేఏసీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మండల తహశీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్టీఓలకు ఉద్యోగులు వినతిపత్రాలు అందించారు.

'52 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యంతో రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ రెండో తేదీన పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐదు డీఏలను కూడా విడుదల చేయాలి.' అని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేయాలని ఉద్యోగులు అన్నారు. ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు జారీ చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలి విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More