TG New Ration Cards : ప్రాథమిక జాబితాలు సిద్ధం..! కొత్త రేషన్ కార్డులను ఎలా ఫైనల్ చేస్తారంటే...?

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇటీవలనే కొత్త కార్డుల జారీకి మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కార్డుల జారీ ఉంటుందని పేర్కొంది. అందుకు అనుగుణంగానే… ప్రాథమిక జాబితాలను పౌరసరఫరాలశాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Published on: Jan 18, 2025, 07:15:20 IST
By , , తెలంగాణ, హైదరాబాద్
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 26వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈలోపే అర్హులను గుర్తించే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా…. జిల్లాల వారీగా కొత్త కార్డులకు ఎవరు అర్హులుగా ఉన్నారనే దానిపై పౌరసరఫరాలశాఖ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది.

రేషన్ కార్జుల జారీ ప్రక్రియ...!
రేషన్ కార్జుల జారీ ప్రక్రియ...!

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రజాపాలనకార్యక్రమంలో అనేక మంది దరఖాస్తులు ఇచ్చారు. నిర్ణీత ఫామ్ లో కాకుండా… తెల్ల కాగితంపైనే రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ఇచ్చారు. అయితే వీటి విషయంలో సర్కార్ నుంచి అధికారికంగా క్లారిటీ రాలేదు. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో మాత్రం….సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో సరికొత్త పద్ధతిలో కొత్త రేషన్ కార్జుల జారీ ప్రక్రియ షురూ కానుంది.

గత కొద్ది రోజుల కిందటే రాష్ట్రవ్యాప్తంగానూ సమగ్రకుటుంబ సర్వే నిర్వహించారు. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. అయితే ఈ వివరాల ఆధారంగా… పౌరసరఫరాల శాఖ ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు 6 లక్షలకుపైగా కుటుంబాలు కొత్త కార్డులకు అర్హమైనవిగా గుర్తించింది. ఈ జాబితాలు ఇప్పటికే జిల్లాలకు చేరినట్లు తెలిసింది.

ఎలా ఫైనల్ చేస్తారు..?

పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసిన ప్రాథమిక జాబితాలను జిల్లా అధికారులు పరిశీలిస్తారు. గ్రామాలవారీగా లిస్టులను పంపుతారు. ఈ జాబితాలను గ్రామసభల ముందు ఉంచుతారు. పట్టణాల్లో అయితే బస్తీ సభల్లో ఉంచుతారు. ఇక్కడ లిస్ట్ ను చదివి వినిపించి…. ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. ఈ ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈ లిస్టులను జిల్లా కలెక్టర్లకు చేరుతాయి. కలెక్టర్లు పంపే లిస్ట్ ఆధారంగా పౌరసరఫరాల శాఖ… కొత్త కార్డులను మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ జనవరి 26న నుంచి ప్రారంభమవుతుంది.

ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు మార్పు చేర్పుల దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పెళ్లి అనంతరం పుట్టింటి కార్డులో పేరు తొలిగించి, అత్తింటి కార్డుల్లో పేర్లు జోడించాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటి విషయంలో కూడా సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రేషన్కార్డుల డిజైన్ సైతం మారనుంది. గతంలో ఎలక్ట్రానిక్‌ రూపంలో కార్డులు జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్‌ చేసి ఫిజికల్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తెలుస్తోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More