తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బకాయిల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రభుత్వంతో పలుసార్లు సమావేశం అయింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా.. తర్వాత రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తోపాటుగా ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, లేదంటే కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేమని తెలిపారు. రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
మంత్రులు మాకు సహకరించడం లేదని రమేశ్ బాబు అన్నారు. నవంబర్ 1లోపు రూ.900 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రావాల్సిన బకాయిలపై స్పష్టత ఇవ్వాలన్నారు. నవంబర్ 1న రూ.900 కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటిస్తామన్నారు. నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని భయపెడితే ఊరుకోమని, ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించమని చెప్పారు.
ఇటీవలే బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ రావటంతో కాలేజీలు వెనక్కి తగ్గాయి. అయితే బకాయిల చెల్లింపుల విషయంలో జాప్యం నెలకొంది. బంద్‌కు సంబంధించి ప్రైవేటు కాలేజీల యాజమాన్యం కార్యాచరణను కూడా ప్రకటించింది. ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలను మూసి వేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఇతర ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాయి.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఇతర ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాయి.
{{/usCountry}}