...
...
Next Story

ప్రైవేట్ పాఠశాలలకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

Private Schools Fee : ప్రైవేట్ పాఠాశాలల ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజుల వివరాల గురించి అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపింది.

Published on: Aug 9, 2026, 09:14:28 IST
Advertisement

తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రతి ఏటా మరీ మితిమీరి పడుతున్న ఫీజుల భారాన్ని అరికట్టేందుకు, పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలు తమ తరగతుల వారీ ఫీజుల వివరాలను తగిన ఆధారాలతో సహా డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేటు పాఠశాలల ఫీజులు
ప్రైవేటు పాఠశాలల ఫీజులు

పాఠశాల యాజమాన్యాలు తమ వద్ద అమల్లో ఉన్న ఫీజు వివరాలను విద్యాశాఖ అధికారిక పోర్టల్ అయిన https://schooledu.telangana.gov.in/ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు నిర్బంధ రికార్డులను సమర్పించేలా చూడటంతో పాటు, ఏటేటా అడ్డగోలుగా పెంచుతున్న ఫీజుల దోపిడీకి చెక్ పెట్టడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం.

పాఠశాల విద్య సమగ్ర సంచాలకులు నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలతో మాట్లాడి, ఈ విద్యాసంవత్సరానికి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కేవలం ఫీజు అంకెలను మాత్రమే కాకుండా, ఫీజుల నిర్ణయానికి సంబంధించి పారదర్శకత కోసం పాఠశాలలు కొన్ని వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజు నిష్పత్తి వివరాలు, ఫీజు ఖరారు చేయడానికి నిర్వహించిన చర్చలు, దానికి సంబంధించిన నివేదికలు మరియు ఆధారిత పత్రాలు, పాఠశాల గవర్నింగ్ బోర్డు సభ్యుల సంతకాలతో కూడిన రికార్డులు అప్‌లోడ్ చేయాలి.

ఈ నిర్ణయం ద్వారా ప్రైవేట్ స్కూళ్లలో పారదర్శకత పెరగడమే కాకుండా, విచ్చలవిడిగా ఫీజులు పెంచే సంస్కృతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ప్రతి స్కూల్ విద్యాశాఖ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe