వీడియో : హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రవేట్ బస్సు దగ్ధం.. బయటకు దూకిన 29 మంది!

ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు భయం పుట్టిస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల ప్రమాదాలు మరిచిపోకముందే తాజాగా మరో ప్రమాదం నల్గొండ జిల్లాలో జరిగింది.

Published on: Nov 11, 2025, 09:12:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో బస్సు కాలిబూడిదైన ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి 19 మంది మృతిచెందారు. ఇలా వరుస ప్రమాదాలు మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.

హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం
హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం

హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఒక ప్రైవేట్ ఆపరేటర్ బస్సు దగ్ధమైంది. ఈ సంఘటనలో 29 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

విహారి ట్రావెల్స్‌కు చెందిన ఈ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత బయల్దేరింది. చిట్యాల్ మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను నిద్ర లేపాడు. వారు సకాలంలో బయటకు వచ్చారు. బస్సులో పొగలు వ్యాపించడంతో అనుమానంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను దింపేశారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ బస్సు కూడా నాగాలాండ్‌లో రిజిస్టర్ అయి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాలి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

హైదరాబాద్ - బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు దానిని ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని, బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టడం కంటే ముందే ప్రమాదానికి గురయ్యామని అతడి స్నేహితుడు ఎర్రిస్వామి చెప్పాడు. కావేరీ బస్సు ఢీ కొట్టడం కంటే ముందు.. మరో ఓమ్ని బస్సును బైక్‌ను రోడ్డు మధ్యలోకి లాక్కొచ్చింది. దీంతో కావేరీ బస్సు ఢీ కొట్టింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More