ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలి - సీఎం ఆదేశాలు
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణాలపై సీఎం రేవంత్ సమీక్షించారు. డిజైన్లలో తెలంగాణ సంస్కృతి, కాకతీయుల శిల్పకళ ప్రతిబింబించాలని అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం.. శిల్ప, వాస్తు కళను పరిశీలించి, అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహం మార్పు, రహదారుల మళ్లింపు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా లైన్ల మార్పు అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
రోడ్లను అనుసంధానం చేయాలి - సీఎం
ఆయా అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. విమానాశ్రయాల కాంపౌండ్ వాల్ సమీపం నుంచి రహదారులు నిర్మించాలని, ఆ రహదారులను సమీప జిల్లా… రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని సూచించారు.
ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా పనులు చేపడితే, అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. విద్యుత్, ఆర్ అండ్ బీ, తాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై బీఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి…. ఏకకాలంలో పనులు సాగేలా చూడాలని సూచించారు.
ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని పనులు ముందుకు సాగేలా చూడాలని సూచించారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే… విమానాశ్రయాల ప్రాంగణం లేదా సమీపంలో చెరువులను నిర్మించి, అక్కడి నుంచి ప్రవాహాలను మళ్లించేలా చూడాలని చెప్పారు.
విమానాశ్రయాలకు వచ్చే, వెళ్లే రహదారులు విశాలంగా ఉండడంతో పాటు సమీపంలోని ముఖ్య రహదారులకు అనుసంధానించేలా ఉండాలని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతో పాటు ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి సమావేశంలో పరిశీలించారు. ప్రతి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి, శిల్ప, వాస్తు కళలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. పలు ఆకృతులకు సంబంధించి సీఎం పలు మార్పులను సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

