Sign in

TG SSC Exams 2026 : టెన్త్ హాల్ టికెట్లపై 'క్యూఆర్' కోడ్...! ఇక ఈజీగా వెళ్లొచ్చు

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా విద్యాశాఖ మరో నిర్ణయాన్ని అమలు చేయనుంది. హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ను ముద్రించే యోచనలో ఉంది.

Published on: Dec 17, 2025, 08:26:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ టెన్త్ విద్యార్థుల కోసం విద్యాశాఖ మరో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి ఏడాది ఎంతో కొంత మంది విద్యార్థులు సెంటర్ల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు సకాలంలో వెళ్లలేక పరీక్షలు కూడా తప్పుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే ఈ సమస్య ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా…. విద్యాశాఖ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ను ముద్రించే యోచనలో ఉంది.

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ - 2026
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ - 2026

క్యూఆర్ కోడ్ ముద్రణకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేయగా… ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే…. ఈసారి జరగబోయే పరీక్షల కోసం విడుదల చేసే హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉండనుంది. ఫలితంగా విద్యార్థులు.. వారి సెంటర్లను చాలా సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి. జస్ట్ స్మార్ట్ ఫోన్‌‌‌‌‌‌‌‌తో ఆ కోడ్‌‌‌‌‌‌‌‌ను స్కాన్ చేయగానే గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్ తెలిసిపోతుంది.

మార్చిలో పరీక్షలు…

ఇక ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజిక్స్, బయోలజీ ఎగ్జామ్స్ సమయంలో మాత్రం మార్పులు ఉంటాయి.

  • 14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
  • 18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
  • 23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
  • 28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
  • 02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
  • 07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
  • 13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
  • 15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
  • 16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్)

అన్ని సాధారణ అకడమిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే ఆబ్జెక్టివ్ టైప్(పార్ట్ బీ) ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. చివరి 15 నిమిషాల్లోనే సమాధానాలు పార్ట్ బీ రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి.

పరీక్ష తేదీల షెడ్యూల్‌లో ఈసారి మార్పులు చూడవచ్చు. పరీక్షకు, పరీక్షకు మధ్య విరామం వచ్చేలా టైమ్ టేబుల్ తయారు చేశారు అధికారులు. విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ పరీక్షల్లో ఇదే తరహా విధానం ఉంటుంది. పరీక్షల మధ్య పండుగలు కూడా వస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఎక్కువ రోజుల గ్యాప్ కూడా ఉండనుంది. మరింత ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలు సిద్ధం కావాలని అధికారులు చెబుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More