తెలంగాణలో వర్షాలపై ఆర్ అండ్ బీ కలర్ కోడెడ్ అలర్ట్.. ఎందుకోసం తెలుసా?

వర్ష తీవ్రత ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ రంగుల కోడ్‌తో కూడిన హెచ్చరిక వ్యవస్థను అమలు చేయనుంది. గ్రీన్ అలర్ట్ సమయంలో సాధారణ పర్యవేక్షణ ఉంటుంది.

Published on: Jun 23, 2026 3:57 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రహదారులు, భవనాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, వరదల సమయంలో రోడ్డు రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు సరికొత్త ‘కలర్ కోడెడ్ అలర్ట్’ విధానాన్ని అమలు చేయనుంది. వర్షపాతం తీవ్రతను బట్టి ఈ అలర్ట్‌లను వర్గీకరించి, అధికారులను అప్రమత్తం చేయనున్నారు.

తెలంగాణలో వర్షాలపై ఆర్ అండ్ బీ కలర్ కోడెడ్ అలర్ట్
తెలంగాణలో వర్షాలపై ఆర్ అండ్ బీ కలర్ కోడెడ్ అలర్ట్

వర్ష తీవ్రతను బట్టి 4 రకాల అలర్ట్‌లు

వరద ముప్పు నుంచి రోడ్లు, వంతెనలను రక్షించడానికి, ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి ఆర్ అండ్ బీ శాఖ రూపొందించిన కలర్ కోడెడ్ వ్యవస్థ వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రీన్ అలర్ట్ : సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు ఈ అలర్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు సాధారణంగా పర్యవేక్షిస్తుంటారు.

ఎల్లో అలర్ట్ : వర్ష సూచన కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రంగంలోకి దిగుతారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను తనిఖీ చేయడంతో పాటు, అత్యవసర సేవల కోసం కాంట్రాక్టర్లను సిద్ధంగా ఉంచుతారు.

ఆరెంజ్ అలర్ట్ : భారీ వర్షాలు కురిసే సమయంలో ఏఈఈలు నిరంతరం క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలు చేపడతారు.

రెడ్ అలర్ట్ : ఎక్కడైనా 204 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. ఈ సమయంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏఈఈలు, ఈఈలు అందరూ 24 గంటల పాటు విధుల్లోనే ఉంటూ సహాయక చర్యలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాల సన్నద్ధత, వరద నియంత్రణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతినకుండా చూసేందుకు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (SOP) విడుదల చేసినట్లు ప్రకటించారు. వరదలు వచ్చినప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే గుర్తించాలని స్పష్టం చేశారు.

జూన్ నుంచి అక్టోబర్ వరకు అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న రోడ్డు మార్గాలను గుర్తించి, అక్కడ నిరంతర నిఘా ఉంచాలని చెప్పారు. జేసీబీలు, క్రేన్లు, చెట్లను నరికే యంత్రాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలి. ప్రమాదకరమైన మలుపులు, నీరు ప్రవహించే కాజ్‌వేల వద్ద హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయాలి. రోడ్లు దెబ్బతింటే వెంటనే వాహనాలను మళ్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రతకు సంబంధించిన అత్యవసర పనులపై అధికారులు తక్షణమే నిర్ణయాలు తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

వర్షాకాలం ముగిసే వరకు హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఈ కంట్రోల్ రూమ్ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More