భారత వాతావరణ శాఖ(IMD) సోమవారం (మార్చి 16, 2026) తెలంగాణ 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక జారీ చేసింది. IMD బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు పడే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కురుస్తాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణ జిల్లాలలోని ప్రజలు మార్చి 21 వరకు ఉరుములతో కూడిన వర్షాలు, క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుదలను చూస్తారు. ఎండల నుంచి ఉపశమనం పొందనున్నారు. ఐఎండీ, హైదరాబాద్ వాతావరణ సూచన ప్రకారం..'రాబోయే 6 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆదివారం నుండి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.' అని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.
మార్చి 16 సోమవారం నుండి మార్చి 21 వరకు హైదరాబాద్, తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రదేశాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయని IMD తెలిపింది.
రాబోయే 24 గంటలు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 36 మరియు 23 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
{{/usCountry}}రాబోయే 24 గంటలు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 36 మరియు 23 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
{{/usCountry}}IMD ప్రకారం, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మార్చి 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అనేక జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోకూడదని ఐఎండీ హెచ్చరించింది.
- ఈ ఆకస్మిక వర్షాలకు కారణం మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది.