...
...
Next Story

తెలంగాణ వెదర్ అప్డేట్ - ఇవాళ, రేపు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాలకు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Published on: Oct 5, 2026, 07:46:06 IST
Advertisement

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయి.

ఈ తేదీ నుంచి పొడి వాతావరణం…..

అక్టోబర్ 7వ తేదీ ఉదయం 08:30 గంటల తర్వాత తెలంగాణలో వాతావరణం మారనుంది. అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు రాష్ట్రమంతటా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, ఆ రోజుల్లో ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు లేవు.

వానల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలగడం, చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ప్రజలు విద్యుత్ స్తంభాలు, పాత భవనాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, మున్సిపల్ అధికారులతో పాటు అత్యవసర సేవల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks