...
...
Next Story

వెదర్ రిపోర్ట్ : ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు - తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP Telangana Weather Update : ఏపీ, తెలంగాణలో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

Published on: Aug 21, 2026, 10:45:43 IST
Advertisement

AP Telangana Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ఇవాళ(ఆగస్ట్ 21) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు….

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం… ఇవాళ పోలవరం, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడా ఇక్కడా పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుసే సూచనలున్నాయి.

పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు. సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు.

కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయి.

తెలంగాణలో ఈదురుగాలులు….

మరోవైపు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…. తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్ వాతావరణం ఎలా ఉండనుంది..?

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe