హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్ కోనుగొలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న 137 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను వివరాలను ప్రకటించింది.

స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 137 ఓపెన్ ప్లాట్లను ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ప్రకటించారు.
ఆసక్తిగల వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్పష్టమైన ల్యాండ్ టైటిల్ ఉంటుంది. మంచి కనెక్టివిటీతో పాటు ప్రాథమిక మౌలిక సదుపాయాలతో కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర చదరపు గజానికి రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది. దరఖాస్తులతో పాటు EMD చెల్లింపులను మీసేవా / ఆన్‌లైన్ / UPI / DD ద్వారా చేయవచ్చని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం https://swagruha.telangana.gov.in/ais/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు .
- తొర్రూరు - 105 ఫ్లాట్లు
- బహుదూర్ పల్లి – 12 ఫ్లాట్లు
- కుర్మల్ గూడ – 20 ఫ్లాట్లు
గత కొంతకాలంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తొర్రూర్ లోని ప్రాజెక్టు సైట్ లోని ప్లాట్లను స్వయంగా చూసుకుని నచ్చిన ప్లాట్ల నెంబర్లను నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తున్నారు. ఇప్పటికే ఈ లే అవుట్ లో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో మాట్లాడటం తోపాటు, ప్లాట్ల వాస్తును చూసుకుంటూ సందడి చేస్తున్నారు.
{{/usCountry}}గత కొంతకాలంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తొర్రూర్ లోని ప్రాజెక్టు సైట్ లోని ప్లాట్లను స్వయంగా చూసుకుని నచ్చిన ప్లాట్ల నెంబర్లను నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తున్నారు. ఇప్పటికే ఈ లే అవుట్ లో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో మాట్లాడటం తోపాటు, ప్లాట్ల వాస్తును చూసుకుంటూ సందడి చేస్తున్నారు.
{{/usCountry}}