ంనఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కలెక్టర్‌కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత ధర్మాసనంలో అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు చట్టబద్ధమైన సమయం ఇస్తూ శిక్ష అమలును 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత భూముల జాబితా నుంచి తమకు చెందిన కొన్ని ప్లాట్లను తొలగించాలని కోరుతూ బాధితులు గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. అయితే కలెక్టర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
బాధితుల వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, 60 రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2025 ఆగస్టులో జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కోర్టు విధించిన 60 రోజుల పరిమితి ముగిసినప్పటికీ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోవడంతో బాధితులు 2025 అక్టోబర్ 15న హైకోర్టులో కలెక్టర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 26 ఫిబ్రవరి 2026 ధిక్కరణ పిటిషన్ పడిన తర్వాత అధికారులు కదిలారు. బాధితుల వినతి తిరస్కరించారు. 08 జులై 2026 ప్లాట్ల తొలగింపు వినతిని రెండోసారి తిరస్కరిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే జిల్లా యంత్రాంగం స్పందించడంపై జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్ నమోదయ్యాక హడావుడిగా నోటీసులు ఇవ్వడం, 2026 ఫిబ్రవరి 26న వినతిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తర్వాత జులై 8న మరోసారి తిరస్కరణ నోటీసు ఇవ్వడం ప్రక్రియను నామమాత్రంగా చుట్టేయడమేనని తప్పుబట్టింది.
'ఐఏఎస్ స్థాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను చులకనగా చూడటం లేదా నిర్లక్ష్యం చేయడం సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుంది. కోర్టు గడువులోగా స్పందించకుండా, పిటిషన్ వేసిన తర్వాత నామమాత్రపు ఉత్తర్వులతో ఉల్లంఘనను సరిదిద్దుకోలేరు.' అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.
{{/usCountry}}'ఐఏఎస్ స్థాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను చులకనగా చూడటం లేదా నిర్లక్ష్యం చేయడం సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుంది. కోర్టు గడువులోగా స్పందించకుండా, పిటిషన్ వేసిన తర్వాత నామమాత్రపు ఉత్తర్వులతో ఉల్లంఘనను సరిదిద్దుకోలేరు.' అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.
{{/usCountry}}న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కాలయాపన చేయకుండా నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిందేనని, నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉన్నతాధికారులైనా చట్టానికి జవాబుదారీ కాక తప్పదని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. అయితే కలెక్టర్ అప్పీలుకు వెళ్లేందుకు 4 వారాల వ్యవధి ఉండటంతో, డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.