Telangana Ration : కొనసాగుతున్న రేషన్ బియ్యం పంపిణీ - ఈనెల 30 వరకు అవకాశం

రాష్ట్రంలోని రేషన్ షాపుల వద్ద రద్దీ క్రమంగా తగ్గుతోంది. ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తుండటంతో మొదట్లో చాలా రద్దీ ఉండేది. ఇప్పటికే 85 శాతానికి పైగా వినియోగదారులు రేషన్ తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Published on: Apr 23, 2026, 12:54:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోందని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటికే మెజారిటీ లబ్ధిదారులకు బియ్యం అందినట్లు అధికారులు ధృువీకరించారు. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం….. ఈ నెల 21వ తేదీ నాటికే రాష్ట్రవ్యాప్తంగా 86 శాతం పంపిణీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

రేషన్ పంపిణీ (ఫైల్ ఫొటో)
రేషన్ పంపిణీ (ఫైల్ ఫొటో)

మూడు నెలల కోటా ఒకేసారి..

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రత్యేక మార్గదర్శకాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి మొత్తం 6,43,303 టన్నుల బియ్యం కేటాయించగా… అందులో ఇప్పటికే 5,48,140 టన్నులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు.

ఈ నెల 30 వరకు అవకాశం

ఇంకా ఎవరైనా రేషన్ బియ్యం తీసుకోని వారు ఉంటే…. ఈ నెల 30వ తేదీ వరకు తమ సమీపంలోని రేషన్ దుకాణాల్లో సేకరించుకోవచ్చని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ షాపుల వద్ద కనీస సదుపాయాలను కల్పిస్తున్నారు. ఎక్కడా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియలో ఇబ్బందులు రాకుండా పర్యవేక్షిస్తున్నారు.

సరఫరాలో పారదర్శకతను పాటిస్తూ, బయోమెట్రిక్ విధానం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో బియ్యం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరు నాటికి 100 శాతం పంపిణీ లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న 1: తెలంగాణలో ప్రస్తుతం ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?

జవాబు: ప్రతి వ్యక్తికీ నెలకు 6 కిలోల చొప్పున.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.

ప్రశ్న 2: రేషన్ షాపుల వద్ద బయోమెట్రిక్ పడకపోతే ఏం చేయాలి?

జవాబు: బయోమెట్రిక్ లేదా వేలిముద్రలు పడనప్పుడు ఐరిస్ (కంటి గుర్తింపు) ద్వారా బియ్యం పొందే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3: రేషన్ షాపులు ఏ సమయం వరకు అందుబాటులో ఉంటాయి?

జవాబు: సాధారణ పనివేళల్లో నెలాఖరు వరకు పంపిణీ జరుగుతుంది. స్టాక్ అయిపోయిన చోట తిరిగి నిల్వలు వచ్చిన తర్వాత పంపిణీ కొనసాగుతుంది. రేషన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More