ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కారణంగా ప్రజా రవాణా సేవలు స్తంభించిపోయాయి. రెండో రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి.

ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రజా రవాణా సేవలు స్తంభించిపోవడంతో, ప్రధాన మార్గాల్లో అద్దె బస్సులను నడపడానికి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు అధికారులు ఒక ప్రణాళికను అమలులోకి తెచ్చారు. ఇలా చాలా డిపోల్లో తాత్కాలిక డ్రైవర్ల నియమించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్, సమ్మె కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కష్టాలను తగ్గించడానికి ప్రజా రవాణా సంస్థ అధికారులు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. చాలా పెళ్లిళ్లు ఏప్రిల్ 26, 29 తేదీలలో జరగనున్నాయి.
టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండు వేతన సవరణ కమిషన్లను (పీఆర్సీలను) అమలు చేయడం వంటివి 32 డిమాండ్లపై కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ఇందులో 29 డిమాండ్లకు ఓకే అని, మిగిలినవాటి గురించి చర్చిద్దామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది.
ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూసేందుకు టీజీఎస్ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ సమన్వయంతో తాత్కాలిక డ్రైవర్లను నియమించేందుకు నియామక ప్రక్రియను ప్రారంభించారని టీజీఎస్ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సమ్మె కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి, బస్సులను నడిపేందుకు రోజువారీ ప్రాతిపదికన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు పలు బస్సు డిపోల అధికారులు చెబుతున్నారు
తాత్కాలిక కండక్టర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు తమ ఒరిజినల్ పదో తరగతి సర్టిఫికేట్లతో పాటు బస్ డిపోలోని అధికారులను సంప్రదించవచ్చు. తాత్కాలిక డ్రైవర్లుగా పనిచేయడానికి ఇష్టపడేవారు తమ ఒరిజినల్ హెవీ వెహికల్ లైసెన్సు(హెచ్ఎంవీ ఒరిజినల్ లైసెన్సు)తో పాటు బస్ డిపోలో రిపోర్ట్ చేయవచ్చు. బస్సు డ్రైవర్గా 18 నెలల అనుభవం ఉండాలి. కండక్టర్ పోస్టుకు వచ్చేవారు పదో తరగతి పాస్ అయి ఉండాలి. రోజువారీ (తాత్కాలిక) కండక్టర్లు, డ్రైవర్లకు వరుసగా రోజుకు రూ.800 నుంచి రూ,1000 గౌరవ వేతనం చెల్లిస్తారు.
{{/usCountry}}తాత్కాలిక కండక్టర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు తమ ఒరిజినల్ పదో తరగతి సర్టిఫికేట్లతో పాటు బస్ డిపోలోని అధికారులను సంప్రదించవచ్చు. తాత్కాలిక డ్రైవర్లుగా పనిచేయడానికి ఇష్టపడేవారు తమ ఒరిజినల్ హెవీ వెహికల్ లైసెన్సు(హెచ్ఎంవీ ఒరిజినల్ లైసెన్సు)తో పాటు బస్ డిపోలో రిపోర్ట్ చేయవచ్చు. బస్సు డ్రైవర్గా 18 నెలల అనుభవం ఉండాలి. కండక్టర్ పోస్టుకు వచ్చేవారు పదో తరగతి పాస్ అయి ఉండాలి. రోజువారీ (తాత్కాలిక) కండక్టర్లు, డ్రైవర్లకు వరుసగా రోజుకు రూ.800 నుంచి రూ,1000 గౌరవ వేతనం చెల్లిస్తారు.
{{/usCountry}}