గత కొంతకాలంగా తమిళనాడులోని అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వెళ్తున్నారు. పౌర్ణమి వేళ ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. కొందరు ట్రైన్స్, మరికొందరు సొంత వాహనాల్లో అరుణాచలం వెళ్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.... రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని నాంపల్లి నుంచి కన్యాకుమారి మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను రెగ్యులర్ సర్వీస్ గా క్రమబద్ధీకరించింది.
ట్రైన్ నెంబర్ మార్పు….

గత ఐదు సంవత్సరాలుగా నాంపల్లి - కన్యాకుమారి(ట్రైన్ నెంబర్ 07229/07230) ఎక్స్ ప్రెస్ వీక్లీ రైళ్లుగా రాకపోకలు సాగిస్తోంది. అయితే ఇకపై ఈ ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ సర్వీస్ గా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ట్రైన్ నెంబర్ ను మార్చారు. రెగ్యులర్ సర్వీస్ గా మారిన నేపథ్యంలో నాంపల్లి - కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ నెంబర్ 17069/17070గా మార్పు చేశారు.
హైదరాబాద్ నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 5:20 నిమిషాలకు బయలుదేరే (ట్రైన్ నంబర్ 17069) ఎక్స్ ప్రెస్ రెండో రోజు ఉదయం 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 05:15 నిమిషాలకు కన్యాకుమారి నుంచి (ట్రైన్ నంబర్ 17070) ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ఈ ట్రైన్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
నాంపల్లి నుంచి అరుణాచలం వెళ్లే రెగ్యులర్ ఎక్స్ ప్రెస్…. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై స్టేషన్ల మీదుగా కన్యాకుమారి చేరుకుంటుంది. రెగ్యులర్ సర్వీస్ గా మార్పు చేయటంతో భక్తులకు ఎంతో ఊరట చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.