భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం రెండు ముఖ్యమైన వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరించి క్రమం తప్పకుండా నడపాలని నిర్ణయించింది. లాల్‌కువాన్ - బెంగళూరు సిటీ, అహ్మదాబాద్-తిరుచిరాపల్లి మార్గాల్లో నడిచే ఈ రైళ్లను రెగ్యులరైజ్ చేసినట్టుగా వెల్లడించింది. ఆగే స్టేషన్ల వివరాలను కింద తెలుసుకోవచ్చు.
లాల్‌కువాన్ జంక్షన్ – కేఎస్‌ఆర్ బెంగళూరు – లాల్‌కువాన్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (Train No. 15302/15301)

ఈ రైలు ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 15302 (లాల్‌కువాన్ - బెంగళూరు) సెప్టెంబర్ 19, 2026 నుండి అందుబాటులోకి వస్తుంది (మినహాయింపు తేదీలు: సెప్టెంబర్ 26, అక్టోబర్ 03 మరియు అక్టోబర్ 10). రైలు నంబర్ 15301 (బెంగళూరు - లాల్‌కువాన్) సెప్టెంబర్ 22, 2026 నుండి అందుబాటులోకి వస్తుంది (మినహాయింపు తేదీలు: సెప్టెంబర్ 29, అక్టోబర్ 06 మరియు అక్టోబర్ 13).
కిచ్చా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఈ ట్రైన్లు ఆగుతాయి.
అహ్మదాబాద్ – తిరుచిరాపల్లి – అహ్మదాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (Train No. 19419/19420)
ఈ రైలు గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తుంది. రైలు నంబర్ 19419 (అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి) సెప్టెంబర్ 24, 2026 నుండి ప్రారంభమవుతుంది. రైలు నంబర్ 19420 (తిరుచిరాపల్లి - అహ్మదాబాద్) సెప్టెంబర్ 27, 2026 నుండి ప్రారంభమవుతుంది.
ఈ రైళ్లు అహ్మదాబాద్, వడోదర, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, తాడిపత్రి, కడప, రేణిగుంటలో ఆగుతుంది.
రాయగడ - గుంటూరు కొత్త టైమింగ్స్
రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాయగడ నుంచి గుంటూరు మార్గంలో ప్రయాణించే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేసింది. రైలు నంబర్ 17244 రాయగడ - గుంటూరు డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను సవరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త వేళలు 2026 ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
{{/usCountry}}రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాయగడ నుంచి గుంటూరు మార్గంలో ప్రయాణించే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేసింది. రైలు నంబర్ 17244 రాయగడ - గుంటూరు డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను సవరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త వేళలు 2026 ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
{{/usCountry}}రాయగడ స్టేషన్ : ఇప్పటివరకు ఈ రైలు రాయగడ నుంచి మధ్యాహ్నం 15:00 గంటలకు (3:00 PM) బయలుదేరేది. ఆగస్టు 24 నుంచి మధ్యాహ్నం 14:50 గంటలకే (2:50 PM) బయలుదేరుతుంది.
జిమిడిపేట స్టేషన్ : ఈ స్టేషన్‌కు రైలు చేరుకునే, బయలుదేరే సమయాల్లో కూడా మార్పులు చేశారు. పాత వేళల ప్రకారం మధ్యాహ్నం 15:16 కి వచ్చి 15:18 కి బయలుదేరేది. కొత్త షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 15:06 గంటలకు జిమిడిపేట చేరుకుని, 15:08 గంటలకు బయలుదేరుతుంది.
గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది.